Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకపై విజయం: పాక్‌కు ఝలక్‌ ఇచ్చిన మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌ ఝలక్‌ ఇచ్చింది. కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసినందుకు ఐసీసీ జరిమానా విధించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

పాకిస్థాన్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధంగా, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు 20 శాతం జరిమానా వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5.1 నిబంధన కింద ఈ చర్య తీసుకుంది. టోర్నీలో భాగంగా కార్డిఫ్‌ వేదికగా శ్రీలంకతో జ‌రిగిన‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో గ్రూప్‌ బి నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 237 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఓ వైపు వికెట్లు పడుతున్నా బ్యాట్స్‌మెన్లు మాత్రం గెలుపు కోసం చివరి వరకు పోరాడారు. ఓ దశలో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(61 నాటౌట్‌) అర్ధ సెంచరీకి తోడుగా మహ్మద్‌ ఆమీర్‌(28 నాటౌట్‌) రాణించడంతో 44.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

Champions Trophy: Pakistan team fined after victory over Sri Lanka

అయితే తప్పును ఒప్పుకోవడంతో పాటు జరిమానా చెల్లించేందుకు పాక్ జట్టు అంగీకరించడంతో దీనిపై ఇక ఎటువంటి విచారణ జరపాల్సిన అవరసరముండదని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. రెండోసారి కూడా పాక్‌ జట్టు ఇదే తప్పు చేస్తే కెప్టెన్‌ సర్ఫరాజ్‌ను ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే బుధవారం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్లో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+