హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓటమి పాలవ్వడంపై ఆ జట్టు కోచ్ మికీ ఆర్ధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మికీ ఆర్ధర్ మీడియాతో మాట్లాడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , ఫోటోలు , స్కోరు కార్డు
ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు చిన్నపాటి ప్లాన్స్‌ని అమలు చేయడంలో విఫలం కావడంతోనే భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయామని వాపోయాడు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంటే పాకిస్తాన్ ఆటగాళ్ల మాత్రం ప్రతీదాంట్లోనూ వైఫల్యం చెందారని చెప్పాడు.

తాము చాలా దూరంగా ఉన్నామని, వన్డే క్రికెట్‌లో ప్రస్తుతం మేము ఎక్కడున్నామో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నాడు. 'మా ఆరంభం బాలేదు. ప్రధానంగా బేసిక్స్‌ను కూడా ఫాలో కాలేకపోయాం. పదే పదే క్యాచ్ లు వదిలేయడం మా జట్టు కొంపముంచింది' అని ఆర్ధర్ తెలిపాడు.
'వికెట్లను డైరెక్ట్ గా కొట్టడలేకపోవడమే కాదు.. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కూడా విఫలమయ్యాం. మరొకవైపు ఫీల్డింగ్‌లో వైఫల్యం చెందాం. మొత్తంగా మేము ఏదైతే చేయాలని మైదానంలో బరిలోకి దిగామో అది చేయలేకపోయాం' అని ఆర్ధర్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్‌పై తాజా విజయంతో ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ గెలుపోటముల రికార్డు 12-2గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే పాకిస్థాన్ రెండు సార్లు టీమిండియాను ఓడించింది. కాగా, ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది.