For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పెయిన్‌పుల్': భారత్‌ మ్యాచ్‌లో పాక్ ఆటతీరుపై మండిపడ్డ లెజెండ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడాన్ని చూడటం చాలా బాధగా ఉందని పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడాన్ని చూడటం చాలా బాధగా ఉందని పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) పాక్‌పై భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 Champions Trophy: 'Painful' to watch Pakistan 'being thrashed' by India, says Imran Khan

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్, ఫోటోలు , స్కోరు కార్డు

ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'ఓ ఆటగాడిగా గెలుపు ఓటములు అనేవి మ్యాచ్‌లో సహజం. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పోరాడకుండానే ఓడిపోవడం బాధాకరం' అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

దేశంలో అపారమైన ప్రతిభ ఉందని, ఈ నేపథ్యంలో పాక్‌ క్రికెట్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. 'పాకిస్థాన్ క్రికెట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అలా చేయని పక్షంలో భారత్-పాక్ జట్లలోని ఆటగాళ్ల టాలెంట్ మధ్య అంతరం భారీగా పెరుగుతుంది' అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.

అంతేకాదు భారత్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఇలాంటి తీవ్ర నిరాశాజనక పరాజయాలు ఎదురవుతూనే ఉంటాయని తెలిపాడు. ప్రొఫెషనల్ మెరిట్ ఆధారంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ని కూడా ఎంపిక చేయాలని కూడా ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సూచించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.

ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది. దీంతో టోర్నీలో తొలి మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+