పది మంది వద్దంటున్నా కుంబ్లే వైపే మొగ్గు: కారణం ఇదీ!
హైదరాబాద్: టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) చూస్తోంది. కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని పది మంది ఆటగాళ్లు కుంబ్లేపై వ్యతిరేకతను చూపిస్తున్నా... బీసీసీఐ మాత్రం కుంబ్లేనే కొనసాగించాలని ప్రయత్నిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్| ఫోటోలు | స్కోరు కార్డు
తాజాగా వెస్టిండీస్ పర్యటన పూర్తయ్యేంత వరకూ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను నిలిపివేయాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శి అమితాబ్ చౌదరికి లేఖ రాయడం ఇప్పుడు సంచలనం అయింది. అయితే తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) అంగీకారంతోనే వెలువడనుంది.

కోచ్ ఎంపిక ప్రక్రియను ఆపాలని కార్యదర్శికి లేఖ రాశా
‘ఈ నెల 26న బీసీసీసీ ఎస్‌జీఎమ్ జరిగేంత వరకూ కోచ్ ఎంపిక ప్రక్రియను ఆపాలని కార్యదర్శికి లేఖ రాశా. ప్రస్తుతం భారత జట్టు ఒక టోర్నీలో ఆడుతున్నందున ఈ ప్రక్రియను నిర్వర్తించడం భావ్యం కాదు. ఒకవేళ కుంబ్లేను కొనసాగించినా.. వేరొకరు కోచ్‌గా ఎంపికైనా 2019 వన్డే ప్రపంచకప్ వరకు అప్పగిస్తాం' అని ఖన్నా ఆ లేఖలో పేర్కొన్నారు.

ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా వ్యతిరేకం
మరోవైపు టీమిండియా కొత్త కోచ్ ఎంపిక కోసం హడావుడిగా జరుగుతున్న ప్రక్రియను ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు బోర్డులో సీనియర్ సభ్యులంతా ముంబైలో జరిగే ఎస్‌జీఏంలో కోచ్ ఎంపిక గురించి చర్చించాలన్న ఆలోచనతో ఉన్నారని శుక్లా తెలిపారు.

శ్రీనివాసన్‌కు సన్నిహితుడైన ఆ ఒక్క ఆఫీస్ బేరర్ తప్ప
అప్పటివరకు కోచ్ ఎంపిక ప్రక్రియను నిలిపి వేయాలని ఎక్కువ మంది సభ్యులు భావిస్తున్నారని ఆయన తెలిపారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సన్నిహితుడైన ఒక్క ఆఫీస్ బేరర్ మినహా మిగతా బోర్డు వర్గాలంతా కుంబ్లేపైనే నమ్మకముంచినట్లు వార్తలు వస్తున్నాయి.

సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కూడా
కాగా, సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కూడా కోచ్‌గా కుంబ్లేనే కొనసాగించాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రితో ఈ కమిటీ సమావేశమయ్యాక దీనిపై మరింత స్పష్టత రానుంది. శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఈ ముగ్గురు సమావేశమయ్యే అవకాశముంది.

బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ కూడా
అంతేకాదు టీమిండియా కొత్త కోచ్ పదవికి ఇంటర్వ్యూ చేయాలా లేదా నేరుగా కుంబ్లే కాంట్రాక్టును పునరుద్ధరించాలా? అనే అంశంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే ఈ సమావేశానికి బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ కూడా హాజరుకానున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications