హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , ఫోటోలు , స్కోరు కార్డు
ప్రత్యర్ధి జట్టు ఏ దశలో కూడా సత్తా చాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది.

వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. 32 బంతుల్లో 53 పరుగులు చేసిన యువీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు అద్భుత మైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని మూడోసారి నెలకొల్పి అరుదైన రికార్డుని సాధించారు. పాక్‌పై తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత క్రీజులోకి దిగిన కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా 300కు పైగా పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు బంతుల్లో మూడు హ్యాట్రిక్ సిక్సులతో చెలరేగాడు.
ఈ విజయంతో టీమిండియాపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. అభిమానులు కోహ్లీసేన విజయంపై స్పందించారు. వారి ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నారు.