Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ben Duckett Century: చరిత్ర సృష్టించిన బెన్ డకెట్ - ఛాంపియన్స్ ట్రోఫీలో మరో సెన్సేషనల్ సెంచరీ

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో సెన్సేషన్ సెంచరీ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఏకంగా 351 పరుగులు చేసి అదరగట్టింది. ఈ క్రమంలోనే బెన్ డకెట్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ లో ముందుగా కళ్లు చెదిరే సెంచరీతో శతకొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో 95 బంతుల్లో సెంచరీ మార్క్ ను టచ్ చేసిన డకెట్.. మరో 39 బంతుల్లో 150 పరుగుల మార్క్ ను టచ్ చేశాడు.తద్వారా ఐసీసీ టోర్నమెంట్ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Champions Trophy AUS vs ENG Ben Duckett hits sensational century against Australia

చరిత్ర సృష్టించిన డకెట్
మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌తో 165 పరుగులు చేశాడు బెన్ డకెట్. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. బన్ డకెట్ కన్నా ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ నాథన్ ఆస్ట్లే పేరిట ఉంది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్లే .. యూఎస్ఏ జట్టుపై 177 బంతుల్లో 145 అజేయ పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్ లోని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెన్ డకెట్ (143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 165) సెంచరీ తోడవ్వడంతో ఆస్ట్రేలియా ముందు ఏకంగా 352 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంకా ఈ ఇన్నింగ్స్ లో జో రూట్ (78 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 68) రాణించాడు. జోస్ బట్లర్ (23), లివింగ్‌స్టన్ (14) నామమాత్రపు పరుగులు చేశారు.

Story first published: Saturday, February 22, 2025, 17:13 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+