Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రసవత్తర సమరానికి వేళాయే - ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతో గుర్తుందా ?

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 కథ క్లైమాక్స్ కు వచ్చేసింది. దుబాయ్‌ వేదికగా మార్చి 9 ఫైనల్ జరగనుంది. భారత్‌, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ తుది పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఫైనల్ లో విజయం సాధించి టైటిల్ విన్నర్ గా నిలిచిన ఛాంపియన్ కు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారో తెలుసా?, ఆ మధ్య దీని వివరాలను కూడా ప్రకటించారు మీకు గుర్తుందా? దాని గురించి తెలుసుకుందాం.

భారీ ప్రైజ్‌మనీ..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తంగా రూ. 60 కోట్లు ప్రైజ్‌మనీని కేటాయించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టుకు భారీ ప్రైజ్‌మనీని అందించనున్నారు నిర్వాహకులు. ఆ మధ్య ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. విజయం సాధించిన జట్టుకు ట్రోఫీతో పాటు దాదాపుగా రూ.19.48 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. ఓడిపోయి రన్నరప్ గా నిలిచిన జట్టుకు సుమారు రూ.9.72 కోట్లకు అందజేస్తారు.

Champions Trophy 2025 winner prize money Rs19 48 crores full details are here

ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనలిస్ట్‌లకు కూడా పెద్ద మొత్తంలోనే ప్రైజ్‌మనీని ఇవ్వనున్నారు. సెమీ ఫైనల్ లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అంచనాగా చెరో రూ. 4.86 కోట్లను అందుకుంటాయి. అలానే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన జట్లకు కూడా నగదు బహుమతిని ఇస్తారు. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌కు రూ.3.04 కోట్లు, ఏడు-ఎనిమిది స్థానాల్లో నిలిచిన పాకిస్థాన్, ఇంగ్లాండ్ కు రూ.1.22 కోట్లు అందజేస్తారు. గ్రూప్ స్టేజ్ లో ప్రతి మ్యాచ్ కు రూ.29 లక్షలకు ఇస్తారు.

Take a Poll

ప్రైజ్‌మనీ వివరాలు ఇవే:
విజేత ప్రైజ్‌మనీ : రూ.19.48 కోట్లు;
రన్నరప్ ప్రైజ్‌మనీ : రూ.9.72 కోట్లు;
సెమీ ఫైనలిస్టు ప్రైజ్‌మనీ: ఒక్కో జట్టుకు రూ.4.86 కోట్లు;
ఐదో స్థానం, ఆరో స్థానంలో ఉన్న జట్లకు : రూ.3.04 కోట్లు;
ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్న జట్లకు : రూ.1.22 కోట్లు;
ప్రతి మ్యాచ్ కు ప్రైజ్‌మనీ : రూ.29 లక్షలు

Story first published: Sunday, March 9, 2025, 7:54 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+