For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Champions Trophy: అత్యధిక సిక్స్ లు, ఫోర్లు బాదింది వీరే.. కోహ్లీ, రోహిత్ మాత్రం కాదు

మరి కొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. టీమిండియా మ్యాచుల వరకు మాత్రం దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఇప్పటికే టీమిండియా జట్టును కూడా ప్రకటించారు. ట్రోఫీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, ఈ మెగా టోర్నీ చరిత్రలో ఎక్కువ బౌండరీలు, సిక్స్ లు బాదిన టీమిండియా బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.

1998లో ఈ టోర్నీ ప్రారంభమైంది. అప్పటి నుంచి 2009 వరకు ప్రతీ రెండేళ్లకు ఓ సారి నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఆ తర్వాత నుంచి నాలుగేళ్ల పాటు గ్యాప్ ఇస్తూ 2013, 2017లో నిర్వహించారు. అనంతరం మళ్లీ 8 ఏళ్లకు 2025లో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు 10వ ఎడిషన్.

Champions Trophy 2025 - Which Indian batsman hit the most fours and sixes in the history

ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో శిఖర్ ధావన్ ఎక్కువ ఫోర్లు బాదాడు. 2013, 2017 ఎడిషన్లలో పాల్గొన్నాడు ధావన్. అప్పుడు 10 మ్యాచుల్లోని 10 ఇన్నింగ్స్ లో 79 ఫోర్లు కొట్టాడు.

ఆ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. 1998 నుంచి 2004 వరకు 13 మ్యాచుల్లోని 11 ఇన్నింగ్స్ లో 66 సార్లు బంతిని బౌండరీ తరలించాడు.

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2009-2017 మధ్యలో 13 మ్యాచుల్లో 12 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 53 ఫోర్లను నమోదు చేశాడు.

రోహిత్ శర్మ 2013 నుంచి 2017 వరకు 10 మ్యాచుల్లోని 10 ఇన్నింగ్స్ లో 51 ఫోర్లు బాదాడు.

సచిన్ తెందుల్కర్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 1998 నుంచి 2009 వరకు ఆడిన మాస్టర్ 16 మ్యాచుల్లోని 14 ఇన్నింగ్స్ లో 49 ఫోర్లు బౌండరీ తరలించాడు.

ట్రోఫీ చరిత్రలో ఎక్కువ సిక్స్ లు బాదిన బ్యాటర్లు
గంగూలీ - 13 మ్యాచుల్లో 17 సిక్స్ లు
హార్దిక్ పాండ్య - 5 మ్యాచుల్లో 11 సిక్స్ లు
శిఖర్ ధావన్ - 10 మ్యాచుల్లో 8 సిక్స్ లు
రోహిత్ శర్మ - 10 మ్యాచుల్లో 8 సిక్స్ లు
విరాట్ కోహ్లీ - 13 మ్యాచుల్లో 8 సిక్స్ లు

Story first published: Wednesday, January 22, 2025, 17:34 [IST]
Other articles published on Jan 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+