For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ.. ఏడాది కాలంలో చాలా మారిపోయాడు!' - ధోనీ ఎందుకిలా అన్నాడంటే?

"గత ఏడాడి కాలంలో కోహ్లీ చాలా మారిపోయాడు. అతడు ప్రవర్తించే విధానం చాలా మారింది." అని కోహ్లీ గురించి మాజీ కెప్టెన్ ధోనీ అన్న మాటలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు మహీ.. విరాట్ గురించి ఏం అన్నాడు? ఎందుకన్నాడంటే?

ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ ఫామ్ లో లేక ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాక బ్యాటర్ గా పలు సందర్భాల్లో బానే రాణించినప్పటికీ.. మళ్లీ ఇప్పుడు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. రీసెంట్ గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతగా రాణించలేకపోయాడు. ఇక ఇప్పుడు ఫామ్ అందిపుచ్చుకోవడం రంజీ ట్రోఫీ ఆడమంటే మెడ నొప్పి కారణంగా ఆడనని చెప్పాడు. దీంతో ప్రస్తుతం అతడి ఫామ్ పై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

Champions Trophy 2025 When MS Dhoni praised Virat Kohli captaincy skills after 2013 Zimbabwe tour

ఇదే సమయంలో అభిమానులు, కొంతమంది మాజీలు విరాట్ కెప్టెన్సీని, బ్యాటర్ గా అతడు సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు. పైగా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ జట్టు ప్రకటన నేపథ్యంలో వన్డేల్లో కోహ్లీ సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కోహ్లీపై, అతడి కెప్టెన్సీపై గతంలో మాజీ కెప్టెన్ ధోనీ కురిపించిన ప్రశంసల కామెంట్స్ ను పలువురు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2012లో వైస్ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు అందుకున్నాక, అతడిలో ఎలాంటి మార్పులు వచ్చాయో ధోనీ చెప్పిన విషయాన్ని చెబుతున్నారు.

"జింబాబ్వే పర్యటనలో(2013లో) విరాట్ కోహ్లీ బాగా రాణించాడని నేను అనుకుంటున్నాను. అతడు భావ వ్యక్తీకరణ చేసే వ్యక్తి . ఇది చాలా ముఖ్యం. గత ఏడాడి కాలంలో అతడు చాలా మారిపోయాడు. అతడు ప్రవర్తించే విధానం చాలా పాజిటివ్ గా ఉంది. కెప్టెన్‌గా అతడి బ్యాటింగ్ ప్రదర్శన భారత క్రికెట్‌కు మంచి సంకేతం" అని మహీ పేర్కొన్నాడు.

కాగా, 2012లో ధోనీ డిప్యూటీగా నియమితుడయ్యాడు కోహ్లీ. పలు మ్యాచుల్లో ధోనీ గైర్హాజరీ సమయంలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. ముఖ్యంగా 2013లో వన్డే ట్రై సిరీస్ కప్ లో ధోనీ లేనప్పుడు టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహించాడు. అలానే జింబాబ్వే పర్యటనలో 5-0 తేడాతో గెలిచిన భారత జట్టుకు సారథ్యం వహించాడు.

ఆ తర్వాత 2017లో కోహ్లీ ఫుల్ టైమ్ వన్డే కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అలా కోహ్లీ కెరీర్ లో కెప్టెన్ గా 68.42శాతంతో 95 వన్డేలకు సారథ్యం వహించాడు. తన సారథ్యంలో 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 మెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. 2021లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం కేవలం బ్యాటర్ గానే కొనసాగుతున్నాడు.

Story first published: Saturday, January 18, 2025, 14:28 [IST]
Other articles published on Jan 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+