టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. భారత్ లోనే కాదు, దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్ కు విపరీతంగా పిచ్చ క్రేజ్ ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్ యువతకు కోహ్లీ అంటే ఎంతో పిచ్చో, అభిమానమో తెలిపేలా మరో వీడియో బయటకు వచ్చి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
అంతా కోహ్లీ మయం..
ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మెగా ట్రోఫీలో ఇప్పటికే చాలా మంది పాకిస్థాన్ యువత తమ జట్టు జెర్సీలు కాకుండా కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీలు ధరించి సందడి చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరిగే స్టేడియాల్లో కోహ్లీ నామస్మరణలో హోరెత్తించారు. అతడంటే ఎంత అభిమానమో మీడియా ముందుకు వచ్చి చెబుతూ అరిచి గోల గోల చేశారు.

@18 విరాట్ బైక్ రైడ్
ఈ క్రమంలోనే తాజాగా మరో పాకిస్థాన్ అభిమాని కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో వివరించాడు. తన బైక్ పై 18 నెంబర్ తో విరాట్ పేరు ఉన్న స్టిక్టర్ ను అతికించి... కోహ్లీ అంటే ఎంత అభిమానమో తెలిపాడు. తాను పాకిస్థాన్ రోడ్లపై విరాట్ పేరుతో బైక్ రైడ్ చేస్తానని తెలిపాడు. 'నా బైక్ మీదే కాదు నా కారుపై, నా గుండెల్లోనూ అతడే ఉన్నాడు.' అని చెప్పుకొచ్చాడు.
'మిమ్మల్ని ఎవరైనా కోహ్లీ పేరును ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారా?'.. "మీకో నిజం చెప్తను. నేను, విరాట్ పేరున్న ఉన్న నా బైక్ తో రోడ్డు మీద ఉన్నప్పుడు చాలా మంది అలానే చూస్తుంటారు. దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నా నా దగ్గరికి వచ్చి ఫొటోలు తీసుకుంటుంటారు. అన్ని చోట్లా మంచి, చెడు.. రెండు రకాల మనుషులు ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు ఎందుకు విరాట్ పేరు పెట్టావ్ అని.. నేనంటాను మెసీ నెం.1, రొనాల్డో నెం.1 అని కూడా చాలా చోట్ల ఉంటాయి. అలానే ఇది కూడా నా ఇష్టం అని చెబుతాను." అని సదరు అభిమాని చెప్పుకొచ్చాడు.