Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన జియో హాట్‌స్టార్ - భారత్, చైనా జనాభాను దాటేసిన ఛాంపియన్స్ ట్రోఫీ వ్యూస్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సంచలన రికార్డ్ సాధించింది. రీసెంట్‌గానే ఫైనల్ మ్యాచ్ వ్యూస్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించిన జియో హాట్‌స్టార్.. ఇప్పుడు మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్‌తోనే సంచలనం క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా ఏకంగా యావత్ భారత్-చైనా జనాభా సంఖ్యను దాటేసింది.

మొత్తం ఎన్ని కోట్లంటే
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాగింది. 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్ ను పాక్ హోస్ట్ చేయడం ఇదే తొలిసారి. అలానే అప్ఘానిస్థాన్ కు ఇదే తొలి ఛాంపియన్స్ ట్రోఫీ కావడం మరో విశేషం. అయితే ఈ ప్రతిష్టాత్మక మెగా ట్రోఫీని జియోస్టార్.. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్స్ లో ప్రసారం చేసింది. అలానే జియో హాట్‌స్టార్‌ వెబ్‌సైట్, అప్లికేషన్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ చేసింది. తద్వారా కొత్త ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది. మొత్తం టోర్నమెంట్ ద్వారా 540.3 కోట్ల వ్యూస్ అందుకుంది. ఇది 11వేల కోట్ల మినిట్స్ తో సమానం. ఓ దశలో అత్యధికంగా ఒకేసారి 6.2 కోట్ల మంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీని వీక్షించారు.

హిందీ భాష మాట్లాడే ప్రాంతాల నుంచి .. లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీకి 38 శాతం వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంతాల్లో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హరియాణా ఉన్నాయి. కాగా, భారత్ - కివీస్ ఫైనల్ మ్యాచ్ కు మొత్తంగా 90 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోని భారత్ - పాక్ మ్యాచ్ కు 60 కోట్ల వరకు వీక్షణలు వచ్చాయి.

Champions Trophy 2025 views record crosses India China population in jio hotstar
Photo Credit: .
Story first published: Thursday, March 13, 2025, 16:21 [IST]
Other articles published on Mar 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+