Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: ఫైనల్‌లో తలపడేది ఈ జట్లే.. ఆసీస్ ఆటగాడు ఏమన్నాడంటే?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ ట్రోఫీలో గ్రూప్-ఏలో రెండు జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా.. ఫైనల్ లో ఏ జట్లు తలపడనున్నాయో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

డేనియల్ క్రిస్టియన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తోందని అన్నాడు. శ్రీలంక, పాకిస్థాన్ తో జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా రాణించలేదని.. కానీ ఆసీస్ ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తారని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ ఇంగ్లీష్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్ అద్భుతంగా ఆడారన్నారు. బౌలర్లు కూడా బాగా రాణించారని తాను భావిస్తున్నానన్నారు.

Champions Trophy 2025 These Teams Will Face Off in the Final Says Australian Former Cricketer

హేజిల్‌వుడ్, కమ్మిన్స్, స్టార్క్ లేకుండా బౌలర్లు 350 పరుగులు ఇచ్చారని.. ఇలాగే ఆడటం కొనసాగిస్తే ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్యే పరీక్ష ఉంటుందని తాను భావిస్తున్నానని డేనియల్ క్రిస్టియన్ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అద్భుతమై షాట్లు ఆడుతున్నారని డేనియల్ అన్నాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ ప్రారంభంతో ఆస్ట్రేలియానే ఆడుతుందా.. అనే ఆశ్చర్యం కలిగిందన్నాడు. తాము ఆడుతున్నప్పుడు అలా ఉండేది కాదన్నాడు. ఇలా ఉంటే బౌలర్లు ఒత్తిడికి గురవుతారని తెలిపాడు. బౌలర్లు తమ ప్లాన్‌లను అమలు చేయడం కష్టంగా మారుతుందన్నాడు.

Take a Poll

ఆస్ట్రేలియా బ్యాటర్లు మరింత మెరుగుపడుతున్నారని.. ఆసీస్ జట్టు సరైన సమయంలో కోలుకుంటోందని డేనియల్ క్రిస్టియన్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో గెలవాల్సిన ఒత్తిడిలో ఆస్ట్రేలియా ఉంది. ఆఫ్ఘన్ జట్టును కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పసికూన అని ఆఫ్ఘన్ జట్టును కొట్టిపడేయలేం. చాలా సందర్భాల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తనను తాను నిరూపించుకుంది. కీలక జట్లకు కూడా షాకిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Story first published: Wednesday, February 26, 2025, 11:09 [IST]
Other articles published on Feb 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+