Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుకున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి కుట్ర జరుగుతోందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. తెహ్రీక్ -ఈ తాలిబాన్ పాకిస్తాన్(TTP), ఐఎస్ఐఎస్(ISIS), బలూచిస్తాన్ కు చెందిన ఇతర ఉగ్రవాద గ్రూపులు ఈ కుట్రకు పాల్పడినట్లు పాక్ ఇంటెలిజెన్స్ తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
విదేశీ అతిథులే లక్ష్యంగా ఈ కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు ఈ కుట్రకు తెరతీశాయని.. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్థాన్ కు వెళ్లేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత మ్యాచ్ లను దుబాయ్ కు మార్చారు. ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ అలవోకగా గెలిచింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లను తీశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ 6 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో విజయం సాధించింది.
Shadow of fear on the Champion Trophy...
— Manoj Kumar 🕉️🇮🇳 (@manoj_begu) February 24, 2025
Is it appropriate to arrange sports in a terrorist stronghold?
Intelligence agencies have issued an alert over the risk of an ISKP terrorist attack or kidnapping at #ChampionsTrophy2025! Foreign agencies were also informed of the… pic.twitter.com/O2khpmEdt1