Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shreyas Iyer Sister: అన్న ఛాంపియన్స్ ట్రోఫీలో.. చెల్లి ఐటెమ్ సాంగ్‌లో - దబిది దిబిడే!

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం జట్టులో కీలకంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మిడిలార్డర్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం సెమీఫైనల్ మ్యాచ్ లోనూ మంచి ప్రదర్శనను కొనసాగించాడు. అయితే ఇతడి సోదరి శ్రేష్టా అయ్యర్ చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ఓ ఇటెమ్ సాంగ్ తో స్క్రీన్ పై అరంగేట్రం చేసిన ఈమె.. అటు క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ ప్రియులతో ఫుల్ బాటిల్ కిక్ ఇచ్చింది. ఆమెను చూసిన ప్రేక్షకులు స్పెషల్ సాంగ్స్ లో ఊర్వశి రౌటేలాకు పోటీ ఇచ్చేలా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హాట్ హాట్ స్టెప్పులతో..
శ్రేయస్ అయ్యర్ చెల్లి శ్రేష్టా అయ్యర్ డ్యాన్స్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా. 103కే కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె ఓ ఐటెమ్ సాంగ్ తో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. 'సర్కారి బచ్చా' అనే సినిమాలో 'అగ్రీమెంట్ కర్లే' అనే స్పెషల్ సాంగ్ లో హాట్ హాట్ స్టెప్పులతో చిందులేసింది. బ్లూ కలర్ చిన్న సైజ్ మిడ్డీ వేసుకుని కాలు కదిపింది. ఈ ప్రత్యేక గీతంలో రుస్లాన్ ముంతాజ్, అన్య తివారీలతో కలిసి ఆమె చిందులేసి అభిమానులను ఆకట్టుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది!

కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు..
శ్రేష్టా అయ్యర్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత ముంబయిలోని రామ్ నారాయణ్ రుయా కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. తన అన్న శ్రేయస్ అయ్యర్ తో బాగా కలిసి ఉంటుంది. అన్న ఆడే మ్యాచులకు అప్పుడప్పుడు హాజరై సపోర్ట్ చేస్తుంటుంది. ఈమె పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఐటెమ్ సాంగ్ ఆఫర్ ను అందుకుని స్టెప్పులేసింది.

Shreyas Iyer Siser shresta iyer Bollywood debut with item song Agreement karle in sarkaari bacha movie
Story first published: Tuesday, March 4, 2025, 19:08 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+