Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అస్సలు ఊహించలేదు మా మధ్య ఇలా అయిపోతుందని!' - ధావన్

టీమిండియా ఓపెనర్ గా ధనాధన్ మెరుపులు మెరిపించిన శిఖర్ ధావన్.. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు తన అనుభవాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న అనుంబంధం గురించి మాట్లాడాడు.

అస్సలు ఊహించలేదు ఇలా..
టీమిండియా తరఫున ఎన్నో అత్యుత్తమ రికార్డ్ భాగస్వామ్యాలను నిర్మించిన జోడీ రోహిత్ శర్మ - శిఖర్ ధావన్‌. వీరిద్దరూ కలిసి పలు అంతర్జాతీయ మ్యాచుల్లో ఎన్నో రికార్డులు సృష్టించారు. దీని గురించి ధావన్ మాట్లాడుతూ.. "నేను రోహిత్ తో ఓపెనింగ్ ప్రారంభించినప్పుడు అస్సలు ఊహించలేదు మా బంధం ఇంత ప్రత్యేకంగా మారిపోతుందని. మా భాగస్వామ్యంలో నమ్మకం, కమ్యునికేషన్ లెవల్ చాలా ఎక్కువగా ఉంటుంది." అని చెప్పుకొచ్చాడు.

Champions trophy 2025 Shikhar Dhawan recalls relation with kohli dhoni rohit sharma

విల్ పవర్ ఎక్కువ..
"నేను రంజీలో ఉన్నప్పుడు.. కోహ్లీ అండర్ 19 ఆడి వచ్చాడు. నేను అతడికన్నా మూడేళ్లు పెద్ద. అయినా అప్పుడే మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పాడింది. నా రూమ్ మేట్ కూడా అయిపోయాడు. బాగా ఫూడీ. మటన్, ఇంకా చాలా తింటాడు. ఎక్కువగా సరదాగా ఉండటం, కదిలించి మరీ మాట్లాడటం వంటివి చేస్తుంటాడు. అయితే కోహ్లీ మరింత ఎక్కువ ఫిట్ అవ్వాలని బయట మాటలు వినిపించాయి. దీంతో అతడు పూర్తి డైట్ మార్చుకున్నాడు. అతడిలో విల్ పవర్ ఎక్కువ. సన్నపడి మరింత ఫిట్ గా తయారయ్యాడు. అతడిలో పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది." అని అన్నాడు.

"2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోనీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. కొన్ని మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేనివి. అందులో మహీ భాయ్ తో కలిసి ఆడటం ఒకటి. ఫీల్డ్ లో అతడితో కలిసి ఉప్పప్పుడు ఓ తెలియని ఆత్మవిశ్వాసం ఉంటుంది. చరిత్ర సష్టించిన మహీ భాయ్ తో కలిసి నేర్చుకున్న పాఠాలు, పంచుకున్న విజయాలు, నవ్వులు అన్నింటికీ కృతజ్ఞతలు." అని ధావన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, February 23, 2025, 14:42 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+