Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG VS AUS Semifinal: అప్ఘాన్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాల్సిందే!

పాకిస్థాన్‌లో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ ను ఓడించి విజయోత్సాహంలో అప్ఘానిస్థాన్.. తాజా మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే అప్ఘాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే రావల్పిండి వేదికగా ఆడేందుకు సిద్ధమైన ఆసీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్, పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ వరుణుడు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు లాహోర్ వేదికగా జరగనున్న అప్ఘాన్ - ఆసీస్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉంది. వర్షం పడకుండా మ్యాచ్ కొనసాగి ఫలితం వస్తే... గెలిచిన జట్టు నేరుగా సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది. అదే మ్యాచ్ రద్దైతే పరిస్థితి మరోలా ఉంటుంది.

Champions trophy 2025 semifianal scenario of Afghanistan Australia and South Africa to Qualify

వర్షం పడితే పరిస్థితి ఏంటి
లాహోర్‌ అప్ఘాన్ - ఆసీస్ మ్యాచ్ కు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు 35 శాతం ఛాన్స్ ఉండగా.. రాత్రిపూట భారీ వర్షం పడొచ్చని అంటున్నారు. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే ఆసీస్ కు కలిసొస్తుంది. ఆ జట్టు సెమీస్‌ బెర్త్ ఖరారు చేసేసుకుంటుంది. అఫ్గాన్ మూడు పాయింట్లతో టోర్నీ నుంచి వైదొలుగుతుంది.

Take a Poll

ఇప్పటికే గ్రూప్‌ బీలో మూడు పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్ తో సంబంధం లేకుండా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే అప్ఘాన్ కన్నా సౌతాఫ్రికా నెట్‌ రన్‌రేట్ ఎక్కువగా ఉండటమే కారణం. అదే వర్షం పడకుండా తాజా మ్యాచ్ కొనసాగి అప్ఘానిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టుకే సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Story first published: Friday, February 28, 2025, 12:22 [IST]
Other articles published on Feb 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+