Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: రోహిత్, విరాట్‌లకు తొమ్మిదో నంబర్‌తో ప్రత్యేక అనుబంధం.. ఎందుకో తెలుసా!

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల దుబాయ్‌లో జరగనుంది. న్యూజిలాండ్ ఎప్పుడూ భారత్‌కు కఠినమైన సవాలుగానే మిగిలింది. గత 10 మ్యాచ్ లలో న్యూజిలాండ్ పై భారత్ 6-4తో ఆధిక్యంలో ఉంది. ఐసీసీ టోర్నీల్లో చూసుకుంటే భారత్, న్యూజిలాండ్ మధ్య హోరాహోరో సాగుతోంది. ఐసీసీ ఈవెంట్ల రెండు జట్లు సమానంగా ఉన్నాయి.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో మాత్రం భారత జట్టు విజయయాత్ర ఇంకా ఆగలేదు. రోహిత్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న(అంటే నేడు) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి తొమ్మిదో నంబర్ కు ఉన్న ప్రత్యేక సంబంధం వెలుగులోకి వచ్చింది. భారత జట్టు మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీని గెలిస్తే.. ఈ సంఖ్య రోహిత్, విరాట్ లకు మరింత ప్రత్యేకంగా మారుతుంది.

Champions Trophy 2025 Rohit and Virat s Special Connection with the Number Nine

రోహిత్, విరాట్‌లకు తొమ్మిదో నంబర్‌తో ఏం సంబంధం?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 45వ నంబర్ జెర్సీని ధరించాడు. మరో వైపు విరాట్ కోహ్లీ 18వ నంబర్ ఉన్న జెర్సీని కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మ జెర్సీ మీద నంబర్ లో 4+5 కలిపితే అది 9 అవుతుంది. అలాగే విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 1+8 కలిపితే.. అది కూడా 9 అవుతుంది. ఇదే కాకుండా.. మార్చి 9న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ కెరీర్ లో 9వ ఐసీసీ ఫైనల్ ఆడబోతున్నారు.

అద్భుతమైన ఫామ్ లో విరాట్..
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై సెంచరీ కూడా చేసాడు. సెమీ-ఫైనల్ లో ఆస్ట్రేలియాపై 84 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఫైనల్ లో కూడా కోహ్లీపై చాలా అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కానీ హిట్ మ్యాయన్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఫామ్ లోకి రావడానికి ఇంత కంటే మంచి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది.

Story first published: Sunday, March 9, 2025, 13:04 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+