For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Champions Trophy: ఫేవరెట్‌గా టీమిండియా.. ఇతర జట్ల బలమెంత?

మెగా జట్ల మహా సమరానికి రంగం సిద్ధమైంది. టాప్‌-8 జట్లు హోరాహోరీగా పోరాడే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే ఇతర జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఫామ్ లో పాకిస్థాన్..
ముందుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోన్న పాకిస్థాన్ విషయానికొస్తే.. ఆ మధ్య సౌతాఫ్రికాను వైట్ వైష్, ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి ఫామ్ లో ఉన్న పాకిస్థాన్.. రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ పై ఓడింది. ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సొంతగడ్డపై జరుగుతుండటం పాకిస్థాన్ కు పెద్ద సానుకూలత. ‌ఆటగాళ్లలో బాబర్ ఆజామ్‌ ఫామ్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. రిజ్వాన్, సల్మాన్‌ అఘా, జమాన్‌ ఫామ్ లోనే ఉన్నారు. రవూఫ్‌ ఫిట్ నెస్ సాధించడంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. షహీన్‌ షా, నసీమ్‌ షా, అబ్రార్‌ అహ్మద్‌ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.

Champions Trophy 2025 Preview all teams strengthness and weakness from TeamIndia to pakisthan

పాకిస్థాన్ పై గెలుపుతో న్యూజిలాండ్..
ఓపెనింగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో పోటి పడుతున్నది న్యూజిలాండ్. రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో పాకిస్థాన్ ను ఓడించి జోష్ లో ఉంది. బ్యాటింగ్‌ విభాగం విలియమ్సన్, రచిన్‌ రవీంద్ర, మిచెల్‌, ఫిలిప్స్, కాన్వేతో బలంగా ఉండగా.. బౌలింగ్‌లో హెన్రీ, బ్రాస్‌వెల్, శాంట్నర్, ఒరూర్క్‌ నిలకడగా ఆడుతున్నారు. కాగా, 2000లో ఏకైక ఐసీసీ టోర్నీ గెలిచిన న్యూజిలాండ్‌... ఆ తర్వాత 2009లో ఫైనల్‌ చేరింది.

అంచనాలతో దిగి బోల్తా పడుతూ..
ఇటీవల ముగిసిన ట్రై సిరీస్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తో తలపడింది సౌతాఫ్రికా. ఐసీసీ టోర్నీల్లో ఈ జట్టు అంచనాలతో బరిలోకి చివరికి బోల్తా కొడుతుంటుంది. తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జట్టు.. ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్‌ చేరినా కూడా ముందడుగు వేయలేకపోయింది. ఇక ప్రపంచ‌ కప్‌ తర్వాత 14 మ్యాచ్‌లలో నాలుగే గెలిచింది. ప్రస్తుతం అరంగేట్ర ఆటగాడు బ్రీట్జ్‌కే ఫామ్‌లో కనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో క్లాసెన్, వాండర్‌డసెన్, మార్‌క్రమ్, మిల్లర్‌ జట్టుకు అండగా ఉన్నారు. పేస్‌లో రబాడ, స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్, షంసి రాణిస్తారని అంచనా. ఎంగిడి ఫామ్‌లో కనిపించడం లేదు.

భారత్ పై ఓటమితో ఇంగ్లాండ్..
వరల్డ్‌ కప్‌ తర్వాత 14 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్.. 4 మాత్రమే గెలిచింది. వెస్టిండీస్, భారత్ పై చిత్తుగా ఓడిపోయింది. రీసెంట్ గానే భారత్ పై టీ20, వన్డే సిరీస్ లో ఓడిపోయి విమర్శలను మూటగట్టుకుంది ఇంగ్లాండ్. బ్యాటింగ్ లో డకెట్, సాల్ట్, బ్రూక్, బట్లర్, లివింగ్‌స్టన్, రూట్ బలంగానే ఉన్నారు. స్పిన్నర్ రషీద్ ఒక్కడే పర్వాలేదు. మిగతా స్పిన్నర్లు డౌటే. పేస్ విభాగంలోనూ ఆర్చర్, వుడ్, మహమూద్, సకిబ్‌ ఫామ్‌లో కనిపించడం లేదు.

గాయాలతో ఆస్ట్రేలియా..
ఈ టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా.. గత రెండుసార్లు సెమీస్‌ కు కూడా అర్హత సాధించలేకపోయింది. 2023 ప్రపంచ‌ కప్‌ తర్వాత ఇంగ్లాండ్ పై సిరీస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... పాకిస్థాన్, శ్రీలంక చేతుల్లో ఓడింది. పైగా ఈ సారి ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలతో దూరమయ్యారు. స్టాయినిస్‌ దీంతో ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్, లబుషేన్, ఇంగ్లిస్, షార్ట్, స్పెన్సర్‌ జాన్సన్, అబాట్, ఎలిస్‌ వంటి ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వీరంతా ఎలా రాణిస్తారో చూడాలి.

చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన..
బంగ్లాదేశ్ ఇటీవలే వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్థాన్‌ పై సిరీస్‌లు ఓడిపోయింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయట్లేదు. అయినప్పటికీ టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్ ఆడుతోంది. పేస్‌ బౌలర్లు నాహిద్, తన్‌జీమ్ మంచిగానే రాణిస్తున్నారు. మహ్మదుల్లా, మిరాజ్, ముస్తాఫిజుర్‌ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. మరి ఈ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

బలంగానే కనిపిస్తోంది...
అఫ్గానిస్తాన్‌ జట్టుకు ఇదే తొలి ఛాంపియన్స్‌ ట్రోఫీ కావడం విశేషం. ప్రపంచకప్ తర్వాత ఐదు సిరీస్‌లు ఆడి.. అందులో నాలుగింటిలో గెలిచింది. కెప్టెన్‌ హష్మతుల్లా, గుర్బాజ్, అజ్మతుల్లా బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో రషీద్ జట్టుకు పెద్ద అండ. సీనియర్లు నబీ, నైబ్‌లపై భారీగానే ఆశలు ఉన్నాయి. మొత్తంగా రషీద్‌ ఖాన్, నబి, నూర్‌ అహ్మద్, కరోటెతో కూడిన స్పిన్‌ జట్టు ప్రధాన బలం అని చెప్పాలి.

ఫుల్ జోష్ లో టీమిండియా..
ఇటీవలే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్​ క్లీన్​ స్వీప్ చేసిన టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఈ సిరీస్ తోనే రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ ఫామ్ లోకి వచ్చారు. గిల్, అయ్యర్, రాహుల్ సహా మిగతా ఆటగాళ్లు పర్వాలేదనే ప్రదర్శన చేశారు. బుమ్రా లేకపోవడమే లోటు. మిగతా బౌలర్లు ఫామ్ లోనే ఉన్నారు.

Story first published: Wednesday, February 19, 2025, 9:28 [IST]
Other articles published on Feb 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+