Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత్, పాక్ జట్ల మధ్య ఎప్పుడూ మ్యాచ్ జరిగినా యుద్ధం మాదిరిగా.. ప్రపంచస్థాయిలో అంచనాలు ఉంటాయి. యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ పై బెట్టింగులు, జ్యోతిష్యాలు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. భారత్ కు వ్యతిరేకంగా ఫలితం ఉంటుందని బాబా చెప్పడంతో నెటిజన్లు, భారత క్రికెట్ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుస్తుందని, భారత్ ఓడిపోతుందని ఐఐటీ బాబా చెప్పాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులే కాకుండా.. పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఐఐటీ బాబా మాట్లాడుతూ.. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగే పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ ఓడిపోతుంది. నేను మీకు ముందే చెబుతున్నాను.
విరాట్ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఈ ఫలితాన్ని మార్చలేరు. దేవుడి కన్నా ఎవరూ గొప్ప కాదు.. చూద్దాం ఏం జరుగుతుందో.." అని ఐఐటీ బాబా చెప్పుకొచ్చాడు. ఈ విషయం విని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా షాక్ అయ్యాడు. కాగా బాబా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భారత జట్టు ఇప్పటికే బంగ్లాదేశ్ ను ఓడించి గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉంది. భారత్ పాకిస్థాన్ కంటే ఎంతో బలంగా ఉంది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.
Agar IIT Baba ka tukka laag gya tou kuch log inhe apna bagwan bna lenge 😂 pic.twitter.com/sZPzRxsICe
— Mr. Neeraj (@NeerajS00964849) February 21, 2025
అసలు ఈ ఐఐటీ బాబా ఎవరు?
ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా సందర్భంగా చాలా మంది బాబాలు ప్రాచుర్యంలోకి వచ్చారు. కుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చిన బాబానే ఈ ఐఐటీ బాబా. అతడి అసలు పేరు అభయ్ సింగ్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన ఆయన కుంభమేళాలో ఐఐటీ బాబాగా తనను తాను ప్రకటించుకున్నాడు. సోషల్ మీడియాలో అతడి వీడియోలు వైరల్ గా మారాయి.