ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెర్మనీ (ప్రారంభ వేడుకల్లో), కెప్టెన్ల ఫొటోషూట్, ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమిండియా సారథి రోహిత్ శర్మ.. పాకిస్థాన్ కు వెళ్తాడా లేదా అన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాలు చర్చనీయాశంగా మారింది. గత కొద్ది రోజులుగా దీని గురించే తీవ్రంగా చర్చ సాగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై ఓ పీసీబీ అధికారి స్పందించారు. బీసీసీఐ వ్యవహించే తీరు అస్సలు బాగోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ కు రోహిత్ వస్తాడా లేదా అనే విషయంపై బీసీసీఐ స్పష్టత ఇవ్వకపోవడంతో సదరు పీసీబీ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీసీ తమ దేశానికి సపోర్ట్ గా ఉండాలని కోరారు. "బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకొస్తోంది. ఇది ఆటకు మంచిది కాదు. మొదట భారత జట్టును పాకిస్థాన్ కు పంపడానికి తిరస్కరించారు. ఇప్పడేమో ప్రారంభ వేడుకల కోసం తమ కెప్టెన్(రోహిత్ శర్మ)ను పంపించట్లేదు. ఇక తమ జెర్సీపై కూడా ఆతిథ్యం ఇస్తోన్న పాకిస్థాన్ పేరు ఉండకుండా చేస్తున్నారని తెలిసింది. ఇది బాధాకరం. ఈ విషయంపై ఐసీసీ పాకిస్థాన్ కు సపోర్ట్ గా ఉంటుందని భావిస్తున్నాను" అని సదరు అధికారి బాధను వ్యక్తం చేశారు.

భారత జట్టు షెడ్యూల్
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఎనిమిది దేశాలు ఈ మెగా టోర్నీలో తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ తో ప్రారంభించనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో గ్రూప్ స్టేజ్ లాస్ట్ మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్