మహేంద్ర సింగ్ ధోనీ.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్యాచ్‌లు పట్టుకోవడం, వేగంగా స్టంపింగ్‌లు చేయడం, రనౌట్లు చేయడం, ఎల్బీడబ్ల్యూలు కచ్చితంగా అంచనా వేయడంలో మహీకి సాటి ఎవరూ రారనే చెప్పాలి. అసలు ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే అది కచ్చితంగా ఔట్ అనే అందరూ ఫిక్సైపోతారు. ఈ డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను ధోనీ రివ్యూ సిస్టమ్ అని కూడా క్రికెట్ ఫ్యాన్స్ ట్రెండ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ సారి ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం ఛాంపియన్స్ ట్రోఫీ.
ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ధోనీతో రూపొందించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడా ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా తానెప్పుడూ కూల్‌గానే ఉన్నానని చెప్పిన అతడు.. ఇప్పుడు ఓ క్రికెట్ అభిమానిగా ఛాంపియన్స్ ట్రోఫీని కూల్ గా చూడలేనని అన్నాడు.

ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఓడినా కూడా అంతే సంగతులు. చాలా హాట్‌గా అనిపిస్తోంది అని పేర్కొన్నాడు. దీని కోసం డీఆర్‌ఎస్ (ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్)ను రెడీ చేసినా అస్సలు సరిపోవట్లేదని చెప్పుకొచ్చాడు. అలా ధోనీ కామెంట్స్, విజువల్స్ తో ప్రోమో ఆద్యాంతం ఆసక్తిగా సాగింది.
"నేను కెప్టెన్‌గా కూల్ గా ఉన్నా. కానీ, అభిమానిగా ఈ ట్రోఫీని చూడబోతుండటం చాలా హాట్ గా అనిపిస్తోంది. మనం ఒక్క మ్యాచ్ ఓడినా కూడా అంతే సంగతులు. ఈ టెన్షన్ వల్ల నా బుర్ర హీట్ ఎక్కేస్తోంది. " అని వీడియోలో ధోనీ అంటాడు. ఐస్ గడ్డలతో తయారుచేసిన డ్రెస్, టోపీని ధరించి ఈ కామెంట్స్ చేస్తాడు. అనంతరం ట్యాంకర్లతో ఐస్‌ను తీసుకొచ్చి డంప్ చేసినా హీట్ తగ్గడం లేదంటూ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ పెడతాడు. ఫైనల్ గా.. ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కావాలని థర్డ్ అంపైర్‌కు సూచిస్తాడు. దీంతో తనను పూర్తిగా ఐస్ గడ్డలతో ముంచేసినా కూడా హీట్ మాత్రం తగ్గట్లేదని చెబుతూ ప్రోమోను ముగించాడు. ఈ వీడియోను మీరూ చూసేయండి..
{video1}