Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy: 'షమీ పాపం చేశాడు.. అతడు ఓ క్రిమినల్'..?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడుతోన్న మహ్మద్ షమీ విషయంలో కొత్త వివాదం మొదలైంది. షమీని లక్ష్యంగా చేసుకుని ఓ ముస్లిం మత గురువు తీవ్రంగా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ పాపం చేశాడని, అతడు ఓ నేరస్థుడని పేర్కొన్నారు.

"ఇస్లాంలో ఫాస్టింగ్ చేయడం ఓ బాధ్యత. ఎవరైనా ఉపవాసం చేయడాన్ని ఉద్దేశపూర్వంగా మానేస్తే.. వాళ్లు పాపులతో సమానం. షమీ ఉపవాసం చేయలేదు. అతడు పాపం చేశాడు. కాబట్టి అతడు నేరస్థుడు." అని అల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాహాబుద్దీన్ రజ్వి బరేల్వి అన్నారు.

Champions trophy 2025 Mohammed Shami is a criminal says Muslim cleric for not fasting in ramadan month

దేవుడికి సమాధానం చెప్పాలి..
"రోజా(ఫాస్టింగ్) ఉండటం అనేది తప్పక పాటించాల్సిన బాధ్యత. ఆరోగ్యంగా ఉండే ఓ వ్యక్తి దీన్ని పాటించకపోతే, వాళ్లు బిగ్ క్రిమినల్ తో సమానం. టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ నీరు లేదా ఇంకేదో డ్రింక్ ను మ్యాచ్ సమయంలో తాగాడు. ప్రజలు అతడిని చూస్తున్నారు. అతడు ఆడుతున్నాడంటే, ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. మరి ఆరోగ్యంగా ఉన్న అతడు రోజా ఎందుకు చేయలేదు. నీళ్లు ఎందుకు తాగాడు. ఇది ఎంతో మంది ప్రజలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. అతడు ఫాస్టింగ్ ఉండకుండా నేరానికి పాల్పడ్డాడు. అతడు అలా చేయకూడదు. అతడు నేరస్థుడు. కచ్చితంగా దేవుడికి అతడు సమాధానం చెప్పాలి" అని వీడియోలో బరేల్వి పేర్కొన్నారు.

షమీకి మద్దతుగా..
మతం కన్నా దేశానికే షమీ ఎక్కువ గౌరవం ఇచ్చాడని అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. షమీ ఉపవాసం చేయకపోవడం పెద్ద నేరమేమీ కాదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతన్నారు. దేశం ఎప్పుడూ మతం కన్నా పెద్దది అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా,ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 48 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు షమీ. అయితే ఈ మ్యాచ్ లోనే షమీ జ్యూస్ తాగుతూ కనిపించాడు. దాన్ని ఉద్దేశించే ముస్లిం మత గురువు మౌలానా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Story first published: Thursday, March 6, 2025, 15:47 [IST]
Other articles published on Mar 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+