Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy : పట్టించుకోని బీసీసీఐ! - స్పందించిన కరుణ్ నాయర్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెండు మూడు రోజుల కిందటే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే రోహిత్ శర్మ నాయకత్వంలోనే బరిలోకి దిగనున్న టీమ్‌ఇండియా జట్టులోకి దేశవాళీలో అదరగొట్టిన కరుణ్‌ నాయర్‌ ను తీసుకోలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా భారత జట్టులోకి కమ్ బ్యాక్ ఇస్తాడని ఆశించిన కరుణ్ నాయర్ కు నిరాశ ఎదురైంది.

వన్డే ఫార్మాట్‌లో దూకుడుగా ఆడడంతో పాటు ఏకంగా 8 మ్యాచుల్లో 5 సెంచరీలతో 779 పరుగులు చేసిన అతడిని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు అవకాశం కల్పించకపోవడంపై తాజాగా స్పందించాడు కరుణ్ నాయర్. మూడు రోజుల నుంచి మౌనంగా ఉన్న అతడు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాడు.

Champions Trophy 2025 Karun Nair reacted on not being picked him for Champions Trophy Squad says Have to keep dreaming

"టీమిండియాలోకి పునరాగమనం చేయడం కోసం ఉన్న అవకాశాలు గురించి ఆలోచన మీ మెదడులో ఉండాలి. మీకు దేశం తరఫున ఆడాలని అనుకుంటే, మీరెప్పుడు దాని గురించే కలలు కనాలి. దాని గురించే నిత్యం ఆలోచిస్తూ ఉండాలి. ఆ ఆలోచనలు, కలల మెదడులో ఉన్నాయి. అవే నా మోటివేషన్." అని నాయర్ చెప్పుకొచ్చాడు.

అంతకుముందు కరుణ్ నాయర్ ను ఎందుకు తీసుకోలేదో.. "టీమిండియా జట్టు ప్రకటన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. "హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మేము అతడి గురించి చర్చించాం. 700కు పైగా రన్స్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. ప్రత్యేకమైన ప్రదర్శన అది. కానీ మేం ప్రకటించేది 15 మందితో కూడిన జట్టు మాత్రమే. కాబట్టి ప్రస్తుత టీమ్ లో ప్రతిఒక్కరికీ అవకాశం ఇవ్వడం కష్టం. ఒకవేళ ఎవరైన గాయపడితే అప్పుడు కరుణ్ నాయర్ పేరును పరిశీలిస్తాం." అని అగర్కార్క పేర్కొన్నాడు.

Story first published: Tuesday, January 21, 2025, 15:39 [IST]
Other articles published on Jan 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+