Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

kane williamson: చరిత్ర సృష్టించిన కేన్ మామ - కోహ్లీ సాధించిన రికార్డ్ జాబితాలోకి..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. ఈ పోరులో శతకం బాదడంతో పాటు న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 19 వేల పరుగులు పూర్తి చేసుకున్న న్యూజిలాండ్ తొలి బ్యాటర్ గా ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఈ ఫీట్ నమోదు చేశాడు.

నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్ గా..
విలియమ్సన్ ఈ 19 వేల పరుగుల ఫీట్ ను అంతర్జాతీయ క్రికెట్ లో 440 ఇన్నింగ్స్ లో నమోదు చేశాడు. తక్కువ ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ నమోదు చేసిన నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 399 ఇన్నింగ్స్ లో ఈ 19 వేల పరుగుల ఫీట్ ను నమోదు చేయగా.. సచిన్ తెందుల్కర్ (432), బ్రియాన్ లారా (433), జో రూట్ (444), రికీ పాంటింగ్ (444) ఇన్నింగ్స్ లో సాధించారు.

Champions Trophy 2025 Kane Williamson century Becomes 4th fastest batter to score 19000 runs in SA VS NZ

అత్యధిక సెంచరీల జాబితాలో..
అలానే తాజా సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ స్థానం సంపాదించాడు కేన్ మామ. విరాట్ కోహ్లీ (82), జో రూట్ (53), రోహిత్ శర్మ (49), కేన్ విలియమ్సన్ (48), స్టీవ్ స్మిత్ (48) సెంచరీలు చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు..
ఈ 19 వేల పరుగుల రికార్డ్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (442) చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ గానూ నిలిచాడు విలియమ్సన్. ఈ క్రమంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (441 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు.

Story first published: Wednesday, March 5, 2025, 18:04 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+