ENG VS AUS: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా - ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే రికార్డ్ విజయం
351 ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే రికార్డు స్కోరు అనుకుంటే, ఇంగ్లాండ్ సాధించిన ఈ కళ్లు చెదిరే స్కోర్ నే ఛేజ్ చేసి 356 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా. ఈ రెండు భారీ స్కోర్లు కూడా తాజాగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లోనే నమోదు కావడం విశేషం. పైగా ఈ రెండిటితో పాటు రెండు అద్భుతమైన సెంచరీలు, ఓ అత్యధిక పరుగుల రికార్డు కూడా ఈ మ్యాచ్ లోనే ఆటగాళ్లు సాధించడం మరో విశేషం. ఫైనల్ గా ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఇది రికార్డు విజయం. ఈ విజయంలో 8 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 120* పరుగులు చేసిన ఇంగ్లీష్ కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లీష్ అదిరే శతకం..
351 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 47.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తంగా 356 పరుగులు చేసింది. మ్యాథ్యూ షార్ట్ (66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 63 పరుగులు), మార్నస్ లబుషేన్(45 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 47 పరుగులు), జోష్ ఇంగ్లిష్ (86 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 120*), అలెక్స్ క్యారీ (63 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 69 పరుగులు) అద్భుతంగా రాణించారు. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 32 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
- ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో హైయెస్ట్ సక్సెస్ ఫుల్ ఛేజ్ ఇదే(356)
- ఆస్ట్రేలియా చేసిన రెండో అతిపెద్ద ఛేజ్ ఇదే
- ఇంగ్లాండ్ పై ఇదే అత్యధిక సక్సెస్ ఫుల్ ఛేజ్
- పాకిస్థాన్ గడ్డపై రెండో అత్యధిక సక్సెస్ ఫుల్ ఛేజ్

బెన్ డకెట్ భారీ శతకం
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 351 పరుగులు సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ (165; 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకంతో మెరిశాడు. జో రూట్ (68; 78 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications