Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI vs Pak: పాకిస్థాన్‌కు చావోరేవో - భారత్, పాక్ తుది జట్టు మార్పులివే!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్నతరుణం వచ్చేసింది. దాయాదుల మెగా సమరానికి వేళైంది. అదే భారత్ - పాక్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సెమీస్ అవకాశాలను బతికించుకోవాలని ఓ వైపు పాకిస్థాన్.. అదే సెమీస్ ఛాన్సెస్ ను మరింత మెరుగు పరుచుకోవాలని మరోవైపు భారత్.. రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో తుది జట్టులో ఎవరెవరు బరిలోకి దిగుతారు?, జట్టులో మార్పులు ఏంటి? పిచ్ పరిస్థితి ఎలా ఉంది? టాస్ గెలిచిన జట్టు దేన్ని (బ్యాటింగ్/బౌలింగ్) ఎంచుకోవచ్చు? వంటి వివరాలను తెలుసుకుందాం.

న్యూజిలాండ్‌పై చిత్తుగా ఓడి కసిగా ఉన్న పాకిస్థాన్‌కు ప్రస్తుతం ఈ మ్యాచ్‌ చావోరేవో లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో‌ ఓడిపోతే దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. పైగా 90 దశకం తర్వాత ఇంత కాలానికి ఐసీసీ టోర్నీని హోస్ట్ చేస్తోంది పాక్. కాబట్టి సొంత గడ్డపైనే ఒక్క విజయం లేకుండా టోర్నీ నుంచి వైదొలిగితే పాక్ జట్టు పరువు పోతుంది. అందుకే భారత్ పై మ్యాచ్ గెలవాలని బలంగా సాధన చేస్తూ మ్యాచ్ కోసం సిద్ధమైంది. కానీ మ్యాచ్ లో గెలవాలంటే అన్ని విభాగాల్లోనూ పాక్ రాణించాల్సి ఉంటుంది.

Champions Trophy 2025 IND VS PAK Playing XI squad match preview pitch toss details are here

టీమిండియా విషయానికొస్తే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ విజయంతో ఫామ్ లోకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన తొలి మ్యాచ్‌లో అదిరే ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఇప్పుడా విజయోత్సాహంతోనే పాకిస్థాన్ పై మ్యాచ్ కు రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా దాదాపుగా మార్పుల్లేని జట్టుతోనే బరిలోకి దిగనుందని తెలుస్తోంది. గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన గిల్, షమీ.. ఈ మ్యాచ్ లోనే రాణిస్తే జట్టుకు తిరుగుండదు.

పిచ్ పరిస్థితి ఎలా ఉందంటే..
ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా.. తమకు సంబంధించిన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లోనే ఆడుతోంది. అయితే ఇక్కడ పిచ్‌ కాస్త మందకొడిగా ఉంటుంది. కాబట్టి పరుగులు చేయడం అంత తేలిక కాదు. భారత్‌ -బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనే పిచ్ గురించి స్పష్టత వచ్చింది. ఇప్పుడు పాక్ - భారత్ మ్యాచ్ పిచ్ కూడా ఇలానే ఉండొచ్చు. అందుకే టాస్‌ గెలిచి జట్టు దాదాపుగా బ్యాటింగే చేసే అవకాశముంది.

తుది జట్లు (అంచనా)
టీమిండియా : రోహిత్ శర్మ‌ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, అక్షర్‌ పటేల్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, హర్షిత్‌ రాణా.
పాకిస్థాన్‌ : రిజ్వాన్‌ (కెప్టెన్‌), బాబర్ ఆజామ్, సాద్‌ షకీల్, ఇమాముల్, తయ్యబ్‌ తాహిర్, సల్మాన్‌ ఆఘా, షహీన్‌ అఫ్రిది, ఖుష్‌దిల్‌ షా, హారిస్‌ రవూఫ్, అబ్రార్‌ అహ్మద్, నసీమ్‌ షా.

Story first published: Sunday, February 23, 2025, 8:37 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+