Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS PAK: భారత్ 2 - పాకిస్థాన్ 3.. గత రికార్డులు, మ్యాచ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే

భారత్ - పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైపోయింది. ఈ రెండు దేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసమే ఉత్కంఠతతో వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్ ఎక్కడ జరగనుంది, గత రికార్డులు ఎలా ఉన్నాయి, మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గ్రూప్‌-ఏలో టీమిండియా - పాకిస్థాన్ ఉన్నాయి. ఇప్పుడీ ఇరుజట్లు దుబాయ్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను పాకిస్థాన్ ఓడించి సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా కసిగా ఉంది.

Champions Trophy 2025 Ind vs Pak Match live streaming timing details and head to head records

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటి వరకు టీమిండియా - పాకిస్థాన్‌ ఐదు సార్లు ఢీకొన్నాయి. అయితే ఇందులో మూడు సార్లు పాకిస్థాన్ విజయం సాధించగా.. టీమిండియా రెండు సార్లు గెలుపొందింది. 2004, 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్ గెలవగా.. 2013లో భారత్ విజయాన్ని ఎగరేసుకుపోయింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ మాత్రం గ్రూప్‌ స్టేజ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. ‌తుది పోరులో పాకిస్థానే ట్రోఫీని ముద్దాడింది.

మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్స్ లో లైవ్ చూడొచ్చు. ఓటీటీలో అయితే జియోహాట్ స్టార్ లో వీక్షించొచ్చు.

Story first published: Saturday, February 22, 2025, 22:18 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+