IND VS NZ: అగ్రస్థానం కోసం పోరు.. పిచ్, వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా - భారత్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. దీంతో తొలి సెమీఫైనల్ లో భారత్ తో తలపడే జట్టు ఏదో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్ - కివీస్ మ్యాచ్ పిచ్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పిచ్ ఎలా ఉందంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం. ఇప్పటివరకు దుబాయ్ పిచ్ లపై స్పిన్నర్ల ఎకానమీ 4.36గా నమోదైంది. ఔట్‌ఫీల్డ్ పెద్దగా ఉండటం కూడా స్పిన్నర్లకు బాగా కలిసొచ్చే విషయం. బ్యాటర్లు కఠినమైన సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది. మైదానంలో పెద్దగా భారీ స్కోర్లు నమోదు అవ్వవు. గత రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ 228, పాకిస్థాన్ 241 పరుగులు సాధించాయి. అలాగే లక్ష్యాన్ని ఛేదించడం జట్టుకు కాస్త కష్టమే అవ్వొచ్చు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఆడే జట్టుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది.

వాతావరణం ఎలా ఉందంటే?
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వర్షం వల్ల మూడు మ్యాచులు రద్దయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లు పాకిస్థాన్ లో జరిగాయి. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగే భారత్ మ్యాచులు దుబాయ్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం లేదు. ఎండ కాస్తోంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్..
న్యూజిలాండ్‌తో జరిగిన గత ఐదు వన్డేల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అంతకుముందు న్యూజిలాండ్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియాను ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - కివీస్ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2000 ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తంగా భారత్ - న్యూజిలాండ్ 118 మ్యాచులు ఆడగా.. భారత్ 60 సార్లు, కివీస్ 50 సార్లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ టై అవ్వగా.. 7 మ్యాచుల్లో ఫలితం రాలేదు.
A crucial matchup set to shape the #ChampionsTrophy semi-finals 🏆
— ICC (@ICC) March 2, 2025
Who will finish top of Group A?
How to watch 🎥 https://t.co/S0poKnxpTX pic.twitter.com/BTobmBvGNc
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications