Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS BAN: టీమిండియా మ్యాచ్‌కు అదే పరిస్థితి.. దుబాయ్ స్టేడియంలో ఖాళీ కుర్చీలు!

దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లకు కళ తప్పింది. పాకిస్థాన్ కరాచీ వేదికగా జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ కు ప్రేక్షకులు రాక స్టేడియం వెలవెలబోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దుబాయ్ ఇండర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా - బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. స్టేడియంలో ఖాళీ స్టాండ్ లు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చాలా వరకు ఖాళీగా కుర్చీలు..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్ టీమిండియా - బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి... విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఆడుతున్నాయి. కానీ వారికి అభిమానుల నుంచి మద్దతు కరువైంది. సోషల్ మీడియా వేదికగా వారికి సపోర్ట్ ఇచ్చే వాళ్లు ఉన్నా.. నేరుగా స్టేడియానికి వచ్చి మద్దతు ఇచ్చే ప్రేక్షకులు కరువయ్యారు. స్టేడియం సామర్థ్యం 25 వేల మంది కాగా, స్టాండ్స్ లో చాలా వారకు ఖాళీ కుర్చీలు కనిపించాయి.

Champions Trophy 2025 IND VS BAN Dubai stadium empty seats photos goes viral

మండిపడుతోన్న ఫ్యాన్స్...
ఆరంభ మ్యాచ్ అంటే పాకిస్థాన్ - న్యూజిలాండ్ కాబట్టి ప్రేక్షకులు రాలేదనుకుంటే.. అగ్రజట్టైన టీమిండియా ఆడే మ్యాచ్ కు అభిమానులు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా దుబాయ్ లో భారత్ కు చెందిన జనాభా చాలా మందే ఉంటారు. కానీ వారంతా కూడా స్టేడియానికి రాకపోవడంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎందుకిలా జరిగిందంటూ.. మ్యాచ్, స్టేడియం నిర్వాహకులపై మండిపతున్నారు.

Story first published: Thursday, February 20, 2025, 16:20 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+