Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CHAMPIONS TROPHY 2025: బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ!

ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి భారత - పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుల మధ్య తాజాగా రాజుకున్న మరో వివాదం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీమిండియా ప్లేయర్స్ జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు ముద్ర వేసే విషయమై బీసీసీఐ-పీసీబీ మధ్య వివాదం చెలరేగింది. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఆటగాళ్ల జెర్సీ పై ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉండాలని తెలుస్తోంది. కానీ పాక్ పేరును ముద్రించడానికి, బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. ఈ క్రమంలోనే తాజాగా.. వివాదస్పదమైన ఈ అంశంలోకి ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ మెసేజ్ పంపించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

"జెర్సీపై టోర్నమెంట్ లోగో ముద్ర వేయడం ప్రతీ జట్టు యొక్క బాధ్యత. ప్రతి జట్టు ఈ నిబంధనను పాటించాలి. కాబట్టి టీమిండియా జెర్సీపై, ప్లేయర్స్ కిట్ పై ఆతిథ్య దేశం పేరుతో ఛాంపియన్స్ ట్రోఫీ లోగో ఉండాలి. ఒకవేళ టీమిండియా దీనిని పాటించకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం." అని ఓ ఐసీసీ అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి.

CHAMPIONS TROPHY 2025 - ICC gave a strong warning message to BCCI Action will be taken on not writing Pakistan name on the players Jersey

ఇక ఈ జెర్సీ వివాదంపై ఓ బీసీసీఐ అధికారి కూడా స్పందించారు. ఇదేం పెద్ద విషయం కాదని, రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడుతోందని, కాబట్టి జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

"జెర్సీపై పేరు కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. అయినా మేం దుబాయ్ లో ఆడుతున్నాం. పాకిస్థాన్ లో ఆడట్లేదు. కాబట్టి జెర్సీపై వాళ్ల పేరు ఉండాలనేం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ సందర్భంగా ఇతర దేశాల్లో పోడియంపై పాకిస్థాన్ పేరును ప్రదర్శించారు. కానీ ఇండియాలో మాత్రం అలా చేయలేదు. పోడియంపై పాకిస్థాన్ పేరును ప్రదర్శించలేదు. కాబట్టి ఐసీసీ రూల్స్ ప్రకారం టీమిండియా జెర్సీపై కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ లోగోను మాత్రమే ముద్రిస్తాం." అని చెప్పారు.

అంతకుముందు పీసీబీ మాట్లాడుతూ.. "బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను తెస్తోంది. దీని వల్ల ఆటకు నష్టం కలుగుతుంది. మొదటగా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపడానికి తిరస్కరించారు. ట్రోఫీ ప్రారంభ వేడుకలకు కెప్టెన్‌ను పంపించట్లేదు. ఇప్పుడేమో టీమిండియా జెర్సీలపై ఆతిథ్య దేశం (పాకిస్థాన్‌) పేరును ముద్రించట్లేదు" అని విమర్శించింది.

Story first published: Wednesday, January 22, 2025, 11:40 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+