For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Champions Trohphy: పాక్ దెబ్బకు ఐసీసీ సీఈఓ రాజీనామా!.. స్పందించిన జైషా

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.తాజాగా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జెఫ్‌ అలార్డీస్‌ రాజీనామా చేశారు.

అలార్డీస్ ఎందుకు రాజీనామా చేశారో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్థాన్‌ సన్నద్ధత గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం ఆయన రాజీనామాకు దారీ తీసిందని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపాడు. దీంతో పాటే మరిన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

2012 నుంచి 2021 వరకు
57 ఏళ్ల అలార్డీస్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. అక్కడి నుంచి వచ్చిన ఆయన 2012లో జనరల్‌ మేనేజర్‌గా ఐసీసీలో జాయిన్ అయ్యారు. 2021 నవంబరులో ఐసీసీ సీఈఓగా నియమితుడయ్యారు.

స్పందించిన జైషా
సీఈఓగా అలార్డీస్‌ రాజీనామాపై ఐసీసీ ఛైర్మన్ షా స్పందించారు. అలార్డీస్.. అంకితభావంతో పని చేశారుని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Champions Trophy 2025 ICC CEO Geoff Allardice resigned meanwhile Jay Shah expressed gratitude for his contributions

అంతకుముందు ఐసీసీలో హెడ్‌ ఆఫ్ ఈవెంట్స్‌ క్రిస్‌ టెట్లే, యాంటీ కరప్షన్‌ యూనిట్‌ హెడ్‌ అలెక్స్‌ మార్షల్‌, మార్కెటింగ్‌ అంజ్ మీడియా హెడ్‌ క్లెయిర్‌ ఫర్లోంగ్‌ వ్యక్తిగత కారణాలతో తమ పదవులకు రాజీనామా చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్టేడియాల రెనోవేషన్
ఆతిథ్య జట్టు పాకిస్థాన్.. కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరపడుతోన్న ఇంకా అక్కడి స్టేడియాలు రెనోవేషన్ పనులను పూర్తి చేసుకోలేదు. దీంతో ట్రోఫీ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అలార్డీస్‌ రాజీనామా చేశారు.

Story first published: Wednesday, January 29, 2025, 10:09 [IST]
Other articles published on Jan 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+