For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ - PCBకు ICC బిగ్ షాక్

ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణ ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత వీడింది. మరో 40 రోజుల్లో ట్రోఫీని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డుకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.

మ్యాచులు జరగాల్సిన పాకిస్థాన్ లోని మూడు వేదికలు గడాఫీ, లాహోర్, కరాచీ స్టేడియాల రెనోవేషన్ పనులు పూర్తి కాలేదట. చాలా పని పెండింగ్ లో ఉందని తెలిసింది. వాస్తవానికి ఈ పనులన్నీ 2024 డిసెంబర్​ 31లోగా పూర్తి కావాల్సి ఉంది. కానీ, సమయం గడుస్తున్నా స్టేడియాల్లో ఇప్పటికీ చాలా పనులు పెండింగ్​ లోనే ఉన్నాయట. సీట్ల పుణరుద్ధరణ నుంచి ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్స్​ రెనొవేషన్, హాస్పిటాలిటీ బాక్సెస్, ఫ్లడ్​లైట్ల ఏర్పాట్లు సహా ఇతర సౌకర్యాలకు సంబంధించిన పనులేనీ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Champions Trophy 2025 ICC Big Shock to PCB Pakistan Risk Losing Entire Champions Trophy as All 3 Stadiums Are in Messy Condition

ఇక ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఐసీసీ రెండో డెడ్ లైన్ కూడా పెట్టింది ఐసీసీ. జనవరి 25 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించింది. కానీ దానికి ఎక్కువ రోజుల సమయం లేదు. దీంతో ఫైనల్ డెడ్ లైన్ ఫ్రిబ్రవరి 12గా విధించింది ఐసీసీ. కానీ స్టేడియాల పునరుద్ధరణ పట్ల పీసీబీ ఆలస్య వైఖరి వహిస్తున్నందుకు, ఐసీసీ సీరియస్ గా ఉందని తెలిసింది. దీంతో ఏకంగా టోర్నీనే పాక్​ నుంచి షిఫ్ట్ చేయాలని అనుకుంటోందట.

అంతకన్నా ముందు అసలు ఈ పుణరుద్ధరణ పనులు ఎక్కడి దాకా వచ్చిందో పరిశీలించేందుకు ఐసీసీ నుంచి ఓ బృందం త్వరలోనే పాకిస్థాన్ లో పర్యటించనుందని సమాచారం అందింది. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాబట్టి నిర్ణీత గడువులోగా రెనోవేషన్ పనులను పూర్తి చేయడం పాక్ క్రికెట్ బోర్డు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.

Story first published: Wednesday, January 8, 2025, 18:24 [IST]
Other articles published on Jan 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+