For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND Vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎవరెన్ని సార్లు తలపడ్డారు? - ఆధిపత్యం ఎవరిది?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య మధ్య తొలి సెమీ ఫైనల్‌ పోరు కోసం రంగం సిద్ధమైంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ముందుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పైగా రెండు బలమైన జట్లే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసీస్‌ - భారత్ మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి? ఎవరెన్ని సార్లు గెలిచారు? అప్పుడు మ్యాచ్ విన్నర్లుగా ఎవరు నిలిచారు? అసలు వన్డే క్రికెట్ లో ఇరు జట్ల మధ్య ఎన్నిసార్లు మ్యాచ్ జరగగా.. ఫలితాలు ఎలా వచ్చాయి? గణాంకాలను తెలుసుకుందాం.

వన్డే క్రికెట్ లో హెడ్ టు హెడ్
భారత్ - ఆసీస్ వన్డే క్రికెట్ లో మొత్తం 151 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా, 84 సార్లు ఆసీస్ గెలుపొందింది. 10 మ్యాచులు ఫలితం దక్కలేదు. ఇందులో భారత్ స్వదేశీ గడ్డపై 33 విజయాలను అందుకోగా.. ఆసీస్ 34 సార్లు అందుకుంది. బయట భారత్ 14 సార్లు గెలుపొందగా.. ఆసీస్ 34 సార్లు గెలిచింది. తటస్థ వేదికలపై భారత్ 10సార్లు, ఆసీస్ 12సార్లు గెలిచింది.

Champions trophy 2025 first semifinal Ind vs Aus Head to Head records in Champions Trophy and ODI

సచిన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - ఆసీస్ మధ్య తొలి మ్యాచ్‌ అక్టోబర్ 28, 1998న జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో సచిన్ తెందుల్కర్ బ్యాట్ తో (141; 128 బంతుల్లో) పాటు బంతితోనూ అదరగొట్టాడు. 9.1 ఓవర్లలో 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

Take a Poll

యూవీ ధనాధన్..
2000 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆసీస్ పై టీమిండియానే విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో 20 పరుగుల తేడాతో గెలిచి నాకౌట్‌ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ (84) అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు.

ఆసీస్ విజయం..
అనంతరం 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్‌- ఎలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ (65), రాహుల్ ద్రవిడ్ (52) హాఫ్ సెంచరీలు చేయగా.. ఆసీస్ తరఫున డామియన్ మార్టిన్ (73), రికీ పాంటింగ్ (58), షేన్ వాట్సన్ (50) అర్ధ శతకాలు బాదారు.

మ్యాచ్ రద్దు..
2009 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - ఆసీస్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడడంతో ఫలితం రాలేదు. మ్యాచ్ ను రద్దు చేశారు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు భారత్ ఆసీస్ మొత్తంగా నాలుగు మ్యాచుల్లో తలపడగా.. అందులో రెండు సార్లు భారత్ గెలిచింది. ఆసీస్ ఒక్కసారి విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ రద్దైంది.

Story first published: Tuesday, March 4, 2025, 8:18 [IST]
Other articles published on Mar 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+