For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

25ఏళ్ల కసి, కోపం, పగతో టీమిండియా - ఫైనల్‌ రివెంజ్ కోసం వెయిటింగ్!

సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 2000వ సంవత్సరం. ఆ రోజు కూడా ఫైనల్ మ్యాచే, ప్రత్యర్థి న్యూజిలాండే. కానీ ఫలితం మాత్రం భారత జట్టుకు వ్యతిరేకం. అయితే ఇప్పుడా ఓటమికి కసి తీర్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో కివీస్ తో తలపడనుంది. మార్చి 9 ఈ తుది పోరు జరగనుంది.

ఇదేం తొలిసారి కాదు..
అయితే భారత జట్టు, న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్‌లో తలపడటం ఇదేం తొలిసారి కాదు. గతంలో రెండు సార్లు ఫైనల్స్‌లో ఢీ కొన్నాయి. మొదటగా 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్. ఈ పోరులో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో క్రిస్ కెయిర్న్స్ అద్భుత సెంచరీతో (113 బంతుల్లో 102) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి విజయాన్ని లాగేసుకున్నాడు. అప్పుడు భారత జట్టుకు గంగూలీ సారథిగా వ్యవహరించగా, న్యూజిలాండ్ కు స్టీఫెన్ ఫ్లెమింగ్ సారథిగా వ్యవహరించాడు. మొదట భారత జట్టు 50 ఓవర్లలో 264/6 చేయగా.. అందులో గంగూలీ 117 శతకం బాదాడు. సచిన్ 69 పరుగులు చేశాడు. అయితే మిడిలార్డర్ లో రాహుల్ ద్రావిడ్, వినోద్ కాంబ్లీ, యువరాజ్ సింగ్ విఫలయమ్యారు. అనంతరం భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కెయిర్న్స్ సాయంతో న్యూజిలాండ్ ఛేదించింది. అయితే ఈ టోర్నమెంట్ తర్వాత నుంచి ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్క వైట్-బాల్ ఐసీసీ టైటిల్ కూడా సాధించలేదు. 2015, 2019 ప్రపంచ కప్ ఫైనల్స్‌ కు చేరుకున్నప్పటికీ పరాజయాన్ని అందుకుంది.

Champions Trophy 2025 Final Teamindia VS NewZealand to fight after 25 years in finals

రెండో సారి ఎప్పుడంటే
2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లోనూ న్యూజిలాండే విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. అలా రెండు సార్లు కివీస్ పై ఐసీసీ టోర్నీల్లో మనం ఓడిపోయాం. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

గ్రూప్ స్టేజ్‌లో ఇప్పటికే..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజ్‌ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కివీస్ - జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది. కానీ న్యూజిలాండ్ మాత్రం మనోళ్లపై గట్టిగానే ఒత్తిడిని తీసుకొచ్చింది. కాబట్టి ఈ సారి కూడా ఫైనల్ లో కివీస్ ను తక్కువ అంచనా వేయలేం.

Story first published: Thursday, March 6, 2025, 11:54 [IST]
Other articles published on Mar 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+