Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా రోహిత్‌కు అదే లాస్ట్ మ్యాచ్ కన్ఫామ్! - కొత్త వన్డే సారథి 'అతడే'!!

2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా కొత్త జట్టును సిద్ధం చేయడంతో పాటు కొత్త సారథిని ఎంపిక చేయాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ తన వన్డే కెప్టెన్సీకి రిజైన్ చేస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అతడు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం దాదాపుగా ఖాయమని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.

ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందట. మరోవైపు ఈ తుది పోరు తర్వాత రోహిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. కెప్టెన్సీకి బై చెప్పాక అతడు ఆటగాడిగా కొనసాగుతాడో లేదో అనే తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో వన్డే కొత్త కెప్టెన్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

Champions Trophy 2025 final is rohit sharma Last match as ODI captain and gill to lead teamindia

కొత్త కెప్టెన్ అతడే!
యంగ్ ఓపెనర్ గిల్ నెక్ట్స్ టీమిండియా వన్డే కెప్టెన్ గా ఎంపికవుతాడని అని ప్రచారం సాగుతోంది. వన్డేలో అతడికి మంచి రికార్డే ఉంది. రీసెంట్ గానే అతడు వైస్ కెప్టెన్ గా కూడా నియమితుడయ్యాడు. గత నెలలో ఇంగ్లాండ్ పై మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. వన్డేల్లో తాత్కాలిక కెప్టెన్ గానూ వ్యవహరించాడు. టీ20ల్లో ఫుల్ టైమ్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు గిల్. అతడి సారథ్యంలో జింబాబ్వేపై ఐదు మ్యాచులో టీ20సిరీస్ లో 4-1తేడాతో భారత్ గెలిచింది. కాబట్టి కచ్చితంగా అతడు సారథిగా సరైన వాడని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, March 8, 2025, 13:42 [IST]
Other articles published on Mar 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+