Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం అంటే నేడు దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ కోసం రెండు జట్ల అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. టీమిండియా వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. ఈ ఎడిషన్ లో ఇరు జట్లు అద్బుతంగా ఆడాయి.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఇప్పటివరకు టీమిండియా ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు. కివీస్ జట్టు తన ఏకైక ఓటమిని చవిచూసింది. లీగ్ దశ చివరి మ్యాచ్ లో భారత్ పై కివీస్ 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు నేడు హోరాహోరీగా జరగనుంది. ఈ కీలక మ్యాచ్ ను లైవ్ లో ఎక్కడ వీక్షించవచ్చనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైనల్ మ్యాచ్ టీవీలో ఎక్కడ ప్రత్యక్షప్రసారం అవుతుంది?
దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లలో ప్రత్యక్షప్రసారం చేయబడుతుంది. ఇంకా జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో లైవ్ చూడొచ్చు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను అభిమానులు జియో హాట్ స్ఠార్ యాప్, వెబ్ సైట్ లో పూర్తి ఉచితంగా చూడవచ్చు.
ఇరు జట్లు ఇవే..
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్‌మన్ , డెవాన్ కాన్వే, లాకీ ఫెర్దూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ డఫీ.