Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: ఇంగ్లాండ్ జట్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రితకా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ ప్రయాణం ముగిసింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాపై కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును కూడా నమోదు చేసింది.

ఇంగ్లాండ్ చెత్త రికార్డు
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఇంగ్లాండ్ ఐసీసీ టోర్నమెంట్లలో చెత్త రికార్డును కలిగి ఉంది. నిజానికి క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే నిష్క్రమించిన మొదటి ఐసీసీ టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి టోర్నమెంట్ లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించేది. కానీ ఈ సారి ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు.

Champions Trophy 2025 England s Historic Failure Buttler s Disappointment

జోస్ బట్లర్ కెప్టెన్సీ ముగింపు
ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో ఓటమితో జోస్ బట్లర్ కెప్టెన్సీ కూడా ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమి తర్వాత బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై విజయంతో జోస్ బట్లర్ తన కెప్టెన్సీని ముగిస్తాడని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

బట్లర్ ఏం చెప్పాడంటే?
మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో బట్లర్ మాట్లాడుతూ ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. 'ఈ మ్యాచ్ లో మాప్రదర్శన తీవ్రంగా నిరాశపర్చింది. ఈ రోజు మేం దారుణంగా విఫలమయ్యాం. అది మరింత బాధను కలిగించింది. పిచ్ బాగుంది. కాస్త్ టూపేస్ గా ఉంది. బెన్ డకెట్ దూకుడుగా ఆడి శుభారంభం అందించాడు. కానీ మేం ఆ ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ టోర్నీలో ఏం ఎందుకు విఫలమయ్యామో నాకు తెలియదు. మొత్తానికి విజయాలు సాధించడంలో మేం సమష్టిగా విఫలమయ్యాం. అది మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి మారుతుందనుకుంటున్నా. వాస్తవానికి జట్టులో ప్రతిభకు లోటు లేదు. జట్టులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ పరాజయాల నేపథ్యంలో బ్రెండన్ తో పాటు టాప్ లో ఉన్న వ్యక్తులు కొన్ని ప్రణాళికలు రూపొందిస్తారని భావిస్తున్నాను." అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు.

Story first published: Sunday, March 2, 2025, 8:01 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+