అందుకే కరుణ్ నాయర్‌ను తీసుకోలేదు: అజిత్ అగార్కర్
టీమిండియాలోకి మళ్లీ తనకు చోటు దక్కుతుందని ఆశపడిన కరుణ్ నాయర్ కు నిరాశ ఎదురైంది. తాజాగా ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే కరుణ్ నాయర్ ను ఎందుకు ఎంపిక చేయలేదో వివరించాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్. అలానే విజయ్ హజారే ట్రోఫీలో అతడి కనబరిచిన ప్రదర్శనను ప్రశంసించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మేం అతడి గురించి చర్చించాం. 700కు పైగా పరుగులు చేయడం అంటే మాములు విషయం కాదు. అది ప్రత్యేకమైన ప్రదర్శన. కానీ ఇది 15 మందితో కూడిన జట్టు మాత్రమే. కాబట్టి ప్రస్తుత జట్టులో ప్రతిఒక్కరికీ అవకాశం కల్పించడం కష్టం. ఒకవేళ ఎవరైన గాయపడితే అప్పుడు అతడి పేరును పరిశీలిస్తాం. అని అగర్కార్క పేర్కొన్నాడు.

కాగా,కరుణ్ నాయర్ రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో చెలరేగి ఆడాడు. ఏడు ఇన్నింగ్స్ లో 752 యావరేజ్ తో 752 పరుగులు చేశాడు. 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్ ఇవీ అతడి స్కోర్లు . వీటిలో ఏకంగా ఐదు సెంచరీలు ఉండటం విశేషం. దీంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని అతడు ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పించాలని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. కరుణ్ నాయర్ కూడా తనను ఎంపిక చేస్తే అద్భుతంగా రాణిస్తానని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడతడికి నిరాశే ఎదురైంది.
ఇకపోతే ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య ఇంగ్లాండ్ - టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications