ఇంగ్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అప్ఘానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ విధ్వంసం సృష్టించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 177 భారీ శతకంతో సంచలనం సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల స్కోరును సాధించి పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ అనంతరం తన ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేసిన అతడు.. తాను ఈ శతకం బాదడానికి గల కారణాన్ని చెప్పాడు. ఐపీఎల్ లో ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అలానే తన మెంటార్ యూనిస్ ఖాన్ కు కూడా ధన్యావాదాలు తెలిపాడు.
అతడి చాట్ చేస్తే రెచ్చిపోతా..
"ఆటకు ముందు నేను రషీద్ ఖాన్ తో మాట్లాడాను. నేను ఏదైనా మ్యాచుకు ముందు రషీద్ తో మాట్లాడినప్పుడల్లా, భారీగా పరుగులు చేస్తుంటాను. సెంచరీ బాదడానికి అతడే కారణం. అతడికి కృతజ్ఞతలు." అని ఇబ్రహీం జద్రాన్ అన్నాడు.

యూనిస్ ఖాన్ మెంటార్ షిప్, అలానే హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ తనను ఎంతగానో ప్రోత్సాహించారని అన్నాడు ఇబ్రహీం జద్రాన్. "యూనిస్ ఖాన తన అనుభవాన్ని ఎప్పుడూ మాతో పంచుకుంటుంటాడు. పాకిస్థాన్ లో అతడు చాలా క్రికెట్ ఆడాడు. తొలి మ్యాచ్ లో నేను పరుగులు చేయలేకపోయాను. 'నువ్వు బాగా ఆడుతున్నావు. కాకపోతే బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఎప్పుడైతే నువ్వు 40 పరుగులు దాటుతావో, అప్పుడు 60-70 పరుగులు చేసేలా ముందుకు వెళ్లు.అంతే ఆటోమెటిక్ గా మరింత ముందుకు వెళ్లిపోతావు.' అని నాతో చెబుతుంటాడు. బహుశా అది ఇప్పుడు చేశానేమో." అని జద్రాన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో ఆ జట్టు తరఫున ఆడాలని ఉంది..
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు ఎంత అభిమానమో వివరించాడు జద్రాన్. "ఒకవేళ నాకు ఐపీఎల్ ఆడే అవకాశం వస్తే.. సీఎస్కే తరఫున ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ధోనీ ఉన్నాడు. " అని అన్నాడు.
THA7A FOR A REASON! 🦁🔥 #Thala #DenComing #WhistlePodu 🦁💛 pic.twitter.com/VewJtZxVDr
— Chennai Super Kings (@ChennaiIPL) February 26, 2025
అంత ఈజీ కాదు...
"అంతర్జాతీయ క్రికెట్ లో కమ్ బ్యాక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. నేను 7 నెలల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చాను. కానీ గత ఏడాదిగా వన్డే క్రికెట్ ఆడలేదు. అయినా నాపై అంచనాలు ఉన్నాయి. దాన్ని నేను అందుకోగలిగాను. నాపై నేనే ఒత్తిడి తెచ్చుకుని ఆడాను. ఈ ఇన్నింగ్స్ ను బాగా ఆస్వాదించాను. కేవలం బేసిక్స్ పై దృష్టి పెట్టి ఆడాను. ఇంకా దేని గురించి కూడా ఆలోచించలేదు." అని జద్రాన్ చెప్పుకొచ్చాడు.
A knock that went straight into the #ChampionsTrophy record books from Ibrahim Zadran 👏#AFGvENG ✍️: https://t.co/6IQekpiWp0 pic.twitter.com/Y4W8lJxifW
— ICC (@ICC) February 26, 2025