ENG VS AUS Toss : బిగ్ ఫైట్.. పాపం ఆసీస్.. 16 ఏళ్లుగా ఒక్కసారి కూడా...
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ బీలో భాగంగా అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగనుంది. ఇంగ్లాండ్ చివరిసారిగా పాకిస్థాన్ లో వన్డే మ్యాచ్ ను 2005లో ఆడింది.
అతడు మళ్లీ జట్టులోకి..
ఈ మెగా టోర్నీకి ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమవ్వడంతో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఇంగ్లాండ్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. గాయంతో ఇబ్బంది పడ్డ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జేమీ స్మిత్ మళ్లీ తిరిగి జట్టులోకి చేరాడు.
16 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా...
ఇకపోతే ఆస్ట్రేలియా గత రెండు ఎడిషన్లలోనూ ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కూడా గెలవలేదు. మూడు మ్యాచుల్లో ఓడిపోగా.. మూడు మ్యాచులు ఫలితం రాకుండానే ముగిశాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా ఆస్ట్రేలియా.. 2009 అక్టోబర్ లో మ్యాచ్ గెలిచింది. దీంతో ఇప్పుడు స్టీవ్ స్మిత్ సారథ్యంలో దిగిన ఆస్ట్రేలియాకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పెద్ద సవాల్ గా మారింది
ఆస్ట్రేలియా తుది జట్టు :
మ్యాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

ఇంగ్లాండ్ తుది జట్టు :
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్
Two powerhouses clash at #ChampionsTrophy 🔥
— ICC (@ICC) February 22, 2025
Australia skipper Steve Smith wins the toss and calls to bowl first 🏏#AUSvENG LIVE UPDATES ⬇️https://t.co/zAXA9Xlx5I
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications