Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG VS ENG: చావోరేవో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన అప్ఘాన్ - ఆ మార్పుతో ఇంగ్లాండ్ బరిలోకి

ఆసక్తికరంగా మ్యాచులు సాగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రూప్ - ఏలో సెమీస్ బెర్త్ లు (టీమిండియా, న్యూజిలాండ్) ఖరారైపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రూప్-బిలో సెమీస్ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. చావోరేవో తేల్చుకునేందుకు అఫ్గానిస్థాన్ - ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అప్ఘానిస్థాన్ జట్టు. దీంతో ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ కు దిగింది.

అయితే ఇంగ్లాండ్ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. ఇటీవలే గాయం కార‌ణంగా ఈ టోర్నీకి బ్రాడైన్ కార్స్ దూర‌మయ్యాడు. అతడి స్ధానంలో తుది జ‌ట్టులోకి జేమీ ఓవర్టన్ ను తీసుకుంది. కాగా, ఈ మ్యాచ్ లో ఎవరు ఓడినా ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. అంతకుముందు ఈ రెండు జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌లో ఓట‌మిని అందుకున్నాయి.

Champions Trophy 2025 Afghanistan won the toss and opt to bat against england in afg vs eng match
Photo Credit: X

అఫ్గానిస్థాన్ తుది జట్టు ఇదే
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మానుతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్స్టాక్ ఫరూఖి

ఇంగ్లాండ్ జట్టు ఇదే
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్జామ్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

Story first published: Wednesday, February 26, 2025, 14:43 [IST]
Other articles published on Feb 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+