Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG Vs Aus: సెమీస్ బెర్త్ కోసం యుద్ధం.. ప్రత్యేక వ్యూహాంతో బరిలోకి దిగిన అప్ఘాన్!

పాకిస్థాన్‌ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ ను ఓడించి విజయోత్సాహంలో అప్ఘానిస్థాన్.. తాజా మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

ఇదే సమయంలో ఆస్ట్రేలియా కూడా అప్ఘాన్ ను ఓడించి నేరుగా సెమీస్ కు దూసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన అప్ఘానిస్థాన్ టాగ్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బౌలింగ్ కు దిగనుంది. ఇరు జట్లు మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగాయి.

ప్రత్యేక వ్యూహంతో బరిలోకి..

"వికెట్ మంచిగా ఉంది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం. ఇప్పటికే ఈ పిచ్ పై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆడాయి. కాబట్టి సెకండాఫ్ లో పిచ్ స్లో గా ఉంటుంది. మా స్పిన్నర్లు రాణించొచ్చు. గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై చేసిన ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియాపై గెలిచేందుకు కొన్ని ప్రత్యేక వ్యూహాలు రచించాం. అలానే ఇంగ్లాండ్ పై చేసిన తప్పిదాలను సరి చేసుకుంటాం. ప్రస్తుతం గత మ్యాచ్ లో దిగిన జట్టుతోనే ఇప్పుడు బరిలోకి దిగుతున్నాం" అని హస్మతుల్లా షాహిది అన్నాడు.

Champions Trophy 2025 Afghanistan won the toss and opt to bat against australia in afg vs aus match

ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్ వెల్, బెన్ డ్వారషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

అఫ్గానిస్థాన్ తుది జట్టు ఇదే
రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ

Story first published: Friday, February 28, 2025, 14:17 [IST]
Other articles published on Feb 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+