Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడిస్తాం.. ఆఫ్ఘన్ ఫ్యాన్స్ వార్నింగ్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆప్ఘనిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో 8 పరుగుల తేడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచింది. ఇంగ్లాండ్ పై విజయంతో ఊపుమీదున్న ఆఫ్ఘన్ జట్టు.. నేడు ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఒకవేళ ఆసీస్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే నేరుగా సెమీ-ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి.

ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు. అయితే కొందరు అభిమానులు టీమిండియాను ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్ని జట్లకూ ఓటమి రుచి చూపించామని.. భారత్ ఒక్కటే మిగిలి ఉందన్నారు. ఆ జట్టును దుబాయ్ లో ఓడిస్తామని ఆఫ్ఘన్ ఫ్యాన్స్ అన్నారు. ఆస్ట్రేలియా, భారత జట్లే కాదు ఏ జట్టూ తమ ముందు నిలవలేదని వారు అన్నారు. ఆఫ్ఘన్ ఫ్యాన్స్ వ్యాఖ్యల నేపథ్యం టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలని కోరుకోవడం కరెక్టే కానీ.. అతి విశ్వాసం పనికి రాదని టీమిండియా ఫ్యాన్స్ వారిపై మండిపడుతున్నారు.

Champions Trophy 2025 Afghanistan Fans Warn India We Will Defeat You in the Final

లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఆఫ్ఘన్-ఆసీస్ లు నేడు తలపడుతున్నాయి. ఇంగ్లాండ్ ను ఓడించి విజయోత్సాహంతో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి సెమీస్ కు చేరాలని ఆసీస్ కృతనిశ్చయంతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లలో ఆసీస్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Story first published: Friday, February 28, 2025, 14:06 [IST]
Other articles published on Feb 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+