Champions Trophy 2025: పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల వర్షం కురుస్తోంది. టోర్నమెంట్ లో ఇంకా సగం మిగిలి ఉండగానే.. ఒక సీజన్ లో అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పటికే బద్ధలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. పాకిస్థాన్ లోని పిచ్ లు సెంచరీలకు గనులుగా మారాయనడానికి ఇది రుజువుగా ఉంది. గురువారం వరకు టోర్నమెంట్ లో మొత్తం 9 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా.. వర్షం అంతరాయం కారణంగా ఏడు మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగారు.
అంటే ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 14 ఇన్నింగ్స్ లలో 11 సెంచరీలు నమోదయ్యాయి. దీని అర్థం ఈ సీజన్ లో దాదాపు ప్రతి 1.2 ఇన్నింగ్స్ లలో ఒక శతకం నమోదవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే అత్యధికం. 2017లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ప్రతి 3 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ నమోదైంది. ఆ ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.

ఒక్క సెంచరీ కూడా చేయని ఆతిథ్య జట్టు
29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ ను నిర్వహించే అవకాశం పాకిస్థాన్ కు లభించింది. ఈ నేపథ్యంలో జట్టు నుంచి మంచి ప్రదర్శన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ పాకిస్థాన్ జట్టు నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. ఈ టోర్నమెంట్ లో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయని ఏకైక దేశంగా పాకిస్థాన్ నిలిచింది. ఈ సెంచరీల రేసులో న్యూజిలాండ్ ముందంజలో ఉంది. కివీస్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటివరకు సెంచరీలు సాధించగా.. భారత్, ఇంగ్లాండ్ జట్ల నుంచి ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేశారు.
ఇదే రికార్డు..
ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే కావడం గమనార్హం. గతంలో 2002, 2017లో 10 శతకాల చొప్పున నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు బద్ధలైంది. అంతకు ముందు 2006లో 7 సెంచరీలు, 2000,2009లో 5 శతకాలు, 1998, 2004లో 4 సెంచరీలు, 2013లో 2 సెంచరీలు నమోదయ్యాయి.
ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక శతకాలు ఇవే. గతంలో 2002, 2017లో 10 సెంచరీల చొప్పున నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు బద్దలైంది. అంతకుముందు 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 సెంచరీలు నమోదయ్యాయి.

150 పరుగుల స్కోరు రెండు సార్లు దాటారు..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో సెంచరీలో కాదు రెండు సార్లు 150 పరుగులు కూడా చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ డకెట్ 165 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ రికార్డు నాలుగు రోజులు మాత్రమే కొనసాగింది. ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ కు చెందిన ఇబ్రహీం జద్రాన్ ఈ రికార్డును బద్ధలు కొట్టాడు. బుధవారం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు సెంచరీ వీరులు వీరే..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ లో విల్ యంగ్(న్యూజిలాండ్), టామ్ లాథమ్(న్యూజిలాండ్), తౌహిద్ హృదయ్(బంగ్లాదేశ్), శుభ్‌మన్ గిల్(భారత్), ర్యాన్ రికెల్టన్(దక్షిణాఫ్రికా), బెన్ డకెట్(ఇంగ్లాండ్), జోష్ ఇంగ్లిస్(ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ(భారత్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జాద్రాన్(ఆఫ్ఘనిస్థాన్) శతకాలు సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మొత్తం స్ట్రెక్ రేట్ 90+(91.58)గా ఉండటం ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్ లో జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 87.95 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించారు. టోర్నమెంట్ లో బ్యాటింగ్ సగటు కూడా గత టోర్నమెంట్లతో పోలిస్తే అత్యుత్తమంగా ఉంది. బ్యాటర్లు 35.93 బ్యాటింగ్ సగటుతో పరుగులు చేస్తున్నారు. ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2017లో రెండో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు 35.73గా ఉంది.