ఛాంపియన్స్ ట్రోఫీ: కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ అభిమానులు
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. టోర్నీకి ముందు సన్నాహకాల్లో భాగంగా ఆదివారం తొలి వార్మప్ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా... న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను కలిసి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో తన సంతకంతో కూడిన జెర్సీలు, చిన్న బ్యాట్‌లను అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు.
అభిమానులకు ఆటోగ్రాఫ్‌లిచ్చిన కోహ్లీ
మరికొందరికి కోహ్లీ ఆటోగ్రాఫ్‌లిస్తూ కనిపించాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3/28), మహ్మద్ షమి (3/47) విజృంభించడంతో ఆదివారం భారత్ తన తొలి సన్నాహక మ్యాచ్‌లో సత్తా చాటింది.
45 పరుగుల తేడాతో భారత్ విజయం
డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్‌పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. రోంచి (63 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్ (47 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకున్నారు.
వరుణుడి అడ్డంకి
అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది.
కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు
టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో భారత డ్రస్సింగ్ రూమ్ వద్ద బాల్కనీలో నిలబడిఉన్న విరాట్‌ను చూసి అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు చేశారు. ఇక మంగళవారం జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications