Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్స్ ట్రోఫీ: లండ‌న్‌లో అడుగుపెట్టిన టీమిండియా

హైదరాబాద్: టీమిండియా లండన్‌లో అడుగుపెట్టింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు మే 24 (బుధవారం) రాత్రి ముంబై నుంచి లండన్‌కు టీమిండియా పయనమైన సంగతి తెలిసిందే. విమానం దిగి బస్సులో ఉన్న ప్లేయర్స్ ఫోటోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ వ‌చ్చేశారు అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా మే 28న న్యూజిలాండ్‌తో, మే 30న బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ బీలో ఉంది. అదే గ్రూపులో ఉన్న పాకిస్థాన్‌, శ్రీలంక‌, దక్షిణాఫ్రికాలను ఢీ కొట్టనుంది. ప్ర‌స్తుతం వ‌న్డే ర్యాంకింగ్స్‌లో మూడోస్థానంలో ఉన్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేవ‌రెట్స్‌లో బ‌రిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4వ తేదీన పాక్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది.

గ్రూప్ A: Australia, England, New Zealand, Bangladesh
గ్రూప్ B: India, Pakistan, Sri Lanka, South Africa

ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (WK), కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ (WK), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:
Schedule (All timings are in IST):
June 1: England v Bangladesh, London, 3:00 PM (Group A)
June 2: Australia v New Zealand, Birmingham, 3:00 PM (Group A)
June 3: Sri Lanka v South Africa, London, 3:00 PM (Group B)
June 4: India v Pakistan, Birmingham, 3:00 PM (Group B)
June 5: Australia v Bangladesh, London, 6:00 PM (Group A)
June 6: England v New Zealand, Cardiff, 3:00 PM (Group A)
June 7: Pakistan v South Africa, Birmingham, 6:00 PM (Group B)
June 8: India v Sri Lanka, London, 3:00 PM (Group B)
June 9: New Zealand v Bangladesh, Cardiff, 3:00 PM (Group A)
June 10: England v Australia, Birmingham, 3:00 PM (Group A)
June 11: India v South Africa, London, 3:00 PM (Group B)
June 12: Sri Lanka v Pakistan, Cardiff, 3:00 PM (Group B)
June 14: First Semi-final, Cardiff, 3:00 PM
June 15: Second Semi-Final, Birmingham, 3:00 PM
June 18: FINAL, London, 3:00 PM

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+