
ఆలస్యంగా రోహిత్ శర్మ, కేదార్ జాదవ్
మహారాష్ట్రకు చెందిన ఈ ఇద్దరు క్రికెటర్లు బుధవారం రాత్రి కోహ్లీ సేనతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ, కజిన్ వివాహం కారణంగా రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌కు ఆలస్యంగా బయల్దేరుతుండగా, కేదార్ జాదవ్‌కు ఇంకా వీసా సర్దుబాటు కాలేకపోవడం వల్ల బయల్దేరలేదు.

బీసీసీఐ అధికారిక ప్రకటన
ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. టీమిండియా ఇంగ్లాండ్‌కు బయల్దేర్ సమయానికి కేదార్ జాదవ్‌కు వీసా క్లియరెన్స్ రాలేదని అందు చేతనే అతడు ఆలస్యంగా జట్టుతో కలవనున్నట్లు మేనేజ్ మెంట్ తెలిపింది. కేదార్ జావద్‌కు సాధ్యమైనంత త్వరగా వీసా మంజూర్ చేయాలని బ్రిటిష్ హై కమిషన్‌ను బీసీసీఐ సంప్రదించింది.

ముందుగానే చెప్పిన రోహిత్ శర్మ
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ ఆలస్యంగా ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తెలిపింది. తాను ఆలస్యంగా ఇంగ్లాండ్‌కు పయనం కానున్న విషయాన్ని రోహిత్ శర్మ ముందుగానే తెలియజేసినట్టు బీసీసీఐ పేర్కొంది. గురువారం కేదార్ జాదవ్ వీసా క్లియర్ అయింది. దీంతో అతడు శుక్రవారం ఇంగ్లాండ్ విమానం ఎక్కే అవకాశం ఉంది.

జూన్ 1న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే టీమిండియా ఇంగ్లాండ్ బయల్దేరడానికి ముందు సచిన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా ప్రత్యేక షోని ముంబైలో వీక్షించిన సంగతి తెలిసిందే. కాగా, జూన్ 1 వ తేదీ నుంచి ఆరంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.


Click it and Unblock the Notifications











