46వ ఓవర్ వరకు తెలియదు: కుంబ్లే నిర్ణయం, పాండ్యాకు ఆశ్చర్యం
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రారంభం నుంచే టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (91) పరుగులతో తృటిలో సెంచరీని మిస్ చేసుకోగా, విరాట్ కోహ్లీ (81 నాటౌట్) పరుగులతో రాణించారు. 32 బంతుల్లో 53 పరుగులు చేసిన టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు అద్భుత మైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని మూడోసారి నెలకొల్పి అరుదైన రికార్డుని సాధించారు. పాక్‌పై తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత క్రీజులోకి దిగిన కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా 300కు పైగా పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు బంతుల్లో మూడు హ్యాట్రిక్ సిక్సులతో చెలరేగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది.

ధోని స్ధానంలో పాండ్యా
ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో బరోడాకు చెందిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చిన అందరినీ ఆశ్చరపరిచాడు. అయితే పాండ్యా ధోని స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే విషయం 46వ ఓవర్ వరకు కూడా తనకు తెలియదని మ్యాచ్ అనంతరం చెప్పడం విశేషం.

46వ ఓవర్ వరకు తెలియదు
'46వ ఓవర్‌లో కోచ్ చెప్పే వరకు నాకు తెలియదు. 'నువ్వే తర్వాత బ్యాటింగ్‌కు వెళ్లాలి, ప్యాడ్ కట్టుకో' అని కోచ్ నాతో చెప్పాడు. ఆ తర్వాత యువీ అవుటైన తర్వాత వెంటనే ప్యాడ్ కట్టుకుని, గ్లౌజ్ తీసుకుని మైదానంలోకి వెళ్లాను' అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్యూలో పాండ్యా తెలిపాడు.

తీవ్ర ఒత్తడిలో టీమిండియా
యువరాజ్ సింగ్ అవుటైన సమయంలో టీమిండియా తీవ్ర ఒత్తడిలో ఉంది. దీనిపై కూడా పాండ్యా స్పందించాడు. 'నేను అబద్దం చెప్పడం లేదు. ఆ సమయంలో ఒత్తిడి ఉంది. అయితే తన మదిలో మాత్రం ఇదొక సాధారణ గేమ్ అని, అనవసరమైన ఒత్తిడిని ఆలోచించలేదు' అని పాండ్యా పేర్కొన్నాడు.

స్వేచ్ఛగా ఆడటం వల్లే
అంతేకాదు స్వేచ్ఛగా ఆడటం వల్లే పరుగులు రాబట్టడం సాధ్యమైందని పాండ్యా చెప్పాడు. పాండ్యా ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 20 పరుగులు రాబట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులను పాండ్యా మూడు సిక్సర్లుగా మలచిన తీరు అద్భుతం.

పాండ్యాపై కోహ్లీ ప్రశంసలు
చివర్లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా (20 నాటౌట్; 6 బంతుల్లో 3 ఫోర్లు) చెలరేగి ఆడి భారత్‌కు భారీ స్కోరు అందించారు.చివరి 6 ఓవర్లలో భారత్ ఏకంగా 89 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. పాండ్యా క్రీజులోకి వచ్చిన తర్వాత ప్రతి బంతని స్ట్రయిక్ చేసిన విధానంపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications