Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాక్స్‌వెల్‌ దవడను తాకిన బంతి: తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు కెప్టెన్ స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే లండన్ చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బుధవారం లార్డ్స్ మైదానంలో నెట్స్‌లోమ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో బౌలర్ విసిరిన బంతి తలను తాకడంతో విలవిల్లాడిపోయాడు. మ్యాక్స్‌వెల్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో తమ సహచరుడికి ఏమైందోనని ఆసీస్ ఆటగాళ్లు కంగారుపడ్డారు.

Champions Trophy 2017: Glenn Maxwell hit on the head, survives injury scare

నెట్ బౌలర్ విసిరిన బంతి తలను తాకిన తర్వాత మ్యాక్స్‌వెల్ బాధతో అలాగే నిలుచుండిపోయాడు. దీంతో వెంటనే ఆసీస్ ఆటగాళ్లతో పాటు జట్టు ఫిజియో పీటర్ బ్రక్నర్ పరుగున మ్యాక్స్ వెల్ వద్దకు వచ్చారు. మ్యాక్స్‌వెల్ మెడ‌పై భాగంలో, దవడకు స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేసి, ఫిజియోతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ విసిరిన బంతి మ్యాక్స్‌వెల్ దవడ భాగంలో తాకినట్లు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ తెలిపాడు.

హెల్మెట్ ధరించడంతో తీవ్రమైన గాయం కాలేదని, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే చాలని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి మ్యాక్స్‌వెల్ అందుబాటులోనే ఉండాటని ఆయన పేర్కొన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శుక్రవారం జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఓవల్ మైదానంలో శ్రీలంకతో తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+