Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పటిదాకా ఏ ఐసీసీ ట్రోఫీని గెలవని ఇంగ్లాండ్‌ ఈసారైనా?

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ విజేతగా నిలిచే జట్లలో ఇంగ్లాండ్‌ ఒకటని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు సంవత్సరాలు క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ కనీసం గ్రూప్‌ స్టేజిని కూడా దాటలేదు.

బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలై, తొలి దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇక వన్డేల్లో ఇంగ్లాండ్ పని అయిపోయిందని అనుకున్నారంతా. నిజానికి ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఇంగ్లాండ్, వన్డేల్లో మాత్రం ఆ దిశగా రాణించకపోవడంపై ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది.

వన్డేలకు పనికి రాదని తేల్చేశారు

వన్డేలకు పనికి రాదని తేల్చేశారు

దీంతో ఇంగ్లాండ్‌ వన్డేలకు పనికి రాదని తేల్చేశారు. అయితే ఏమైందో ఏమో గానీ 2015 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌ జట్టు ఆటతీరే మారిపోయింది. వన్డే క్రికెట్‌లో దూకుడు పెంచింది. హేల్స్, జాసన్ రాయ్ లాంటి యువ ఆటగాళ్లతో పాటు పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు ఆ జట్టులో చేరారు.

ఇంగ్లాండ్ వన్డే చరిత్రనే మార్చివేశారు

ఇంగ్లాండ్ వన్డే చరిత్రనే మార్చివేశారు

దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఇంగ్లాండ్ వన్డే చరిత్రనే మార్చివేశారు. వీరికి తోడు ఇయాన్ మోర్గాన్‌, జోస్ బట్లర్‌, బెన్ స్టోక్స్‌ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో పరుగుల వరద పారించడంలో కోహ్లీ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అంతటి పేరు తెచ్చుకున్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటి

పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటి

దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత ప్రమాదకర జట్లలో ఇంగ్లాండ్ ఒకటిగా మారింది. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌‌కు చేరింది. ఒకప్పుడు 300 స్కోర్లు చేయడానికి చాలా కష్టపడిపోయిన ఇంగ్లాండ్‌ ఇప్పుడు మూడొందలు పరుగులంటే అలవోకగా సాధిస్తోంది.

గత రెండేళ్లలో 21 సార్లు 300కు పైగా పరుగులు

గత రెండేళ్లలో 21 సార్లు 300కు పైగా పరుగులు

గత రెండేళ్లలో 43 వన్డేలాడిన ఇంగ్లాండ్‌.. ఏకంగా 21 సార్లు 300కు పైగా పరుగులు సాధించడం విశేషం. బౌలింగ్‌ గొప్పగా లేకపోయినా, స్థానికి పరిస్థితులు ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. జట్టు ఫీల్డింగ్‌ కూడా బాగుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+